ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shobana: నటి శోభన ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2023-07-29T09:26:13+05:30

సినీ నటి, భరతనాట్య కళాకారిణి శోభన(Shobana) ఇంట్లో చోరీ జరిగింది. ఆమె ఇంటి పనిమనిషే చోరీకి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నటి శోభ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సినీ నటి, భరతనాట్య కళాకారిణి శోభన(Shobana) ఇంట్లో చోరీ జరిగింది. ఆమె ఇంటి పనిమనిషే చోరీకి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నటి శోభన తేనాంపేట శ్రీమాన్‌ శ్రీనివాస రోడ్డులో తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో భరతనాట్య శిక్షణ ఇస్తూ మొదటి అంతస్తులో తల్లి ఆనందతో కలిసి ఉంటున్నారు. అయితే, వృద్ధురాలైన తన తల్లి బాగోగులు చూసుకునేందుకు కడలూరు(Kadaluru) జిల్లాకు చెం దిన విజయ అనే మహిళను పనిమనిషిగా పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా తల్లి దాచిపెట్టుకున్న డబ్బు కనిపించక పోవడంతో విజయను ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చింది. ఇంటికి పరాయి వ్యక్తులు రాకపోయినప్పటికీ డబ్బులు ఎలా మాయమవుతున్నాయో అంతుచిక్కక పోవడంతో శోభన తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పని మనిషిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం బయటపడింది. ఆనంద వద్ద చోరీ చేసిన రూ.41 వేలను కారు డ్రైవర్‌కు ఇచ్చి జీపే ద్వారా తన కుమారుడికి పంపినట్లు ఆమె వివరించింది.

Updated Date - 2023-07-29T21:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising