ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిపై అత్యాచారం జరిగిన చోటే కూతురు అనుమానాస్పద మృతి.. ఆమె చేతిలో దొరికిన లేఖలో..!

ABN, First Publish Date - 2023-01-03T19:03:26+05:30

జనవరి 1వ తేదీ.. అందరూ నూతన సంవత్సరం వేళ ఆనందంగా ఉన్నప్పుడు.. 21 ఏళ్ల ఆ యువతి మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. సరిగ్గా అదే స్థలంలో ఏడాది క్రితం ఆమె తల్లిపై అత్యాచారం జరిగింది.. తల్లిపై అత్యాచారం జరిగిన తర్వాత కుటుంబం ఛిన్నాభిన్నం అయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి 1వ తేదీ.. అందరూ నూతన సంవత్సరం వేళ ఆనందంగా ఉండగా.. 21 ఏళ్ల ఆ యువతి మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. సరిగ్గా అదే స్థలంలో ఏడాది క్రితం ఆమె తల్లిపై అత్యాచారం జరిగింది.. తల్లిపై అత్యాచారం జరిగిన తర్వాత కుటుంబం ఛిన్నాభిన్నం అయింది.. తల్లి, తండ్రి విడిపోయారు.. ఆ యువతి ఒంటరిగా మిగిలిపోయింది.. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బలోద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆమె చేతిలో సూసైడ్ నోట్ కూడా ఉంది.

మొహదీపట్‌లో ఉన్న ఢాకా అండ్ ఢాకా ఫ్యాక్టరీలో జనవరి 1వ తేదీ రాత్రి 21 ఏళ్ల యువతి మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ ఫ్యాక్టరీలో ఇనుము తయారీ పనులు జరుగుతున్నాయి. 21 ఏళ్ల ఆ యువతి బీఎస్సీ చదువుతోంది. ఆమె తన సోదరుడితో కలిసి ఫ్యాక్టరీ ఆవరణలో నివసించేది. ఏడాది క్రితం వరకు ఆమె తల్లి కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేసేది. ఏడాది క్రితం ఆమెపై అత్యాచారం జరిగింది. ఫ్యాక్టరీ యజమాని విజయ్ ఢాకా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విజయ్ ఢాకా జైలుకు కూడా వెళ్లాడు (Chhattisgarh Crime News).

అత్యాచార ఘటన తర్వాత బాధిత మహిళ వేరే చోట నివాసం ఉంటోంది. అప్పటికే ఆమె భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో పిల్లలిద్దరూ ఫ్యాక్టరీ ఆవరణలోనే నివాసం ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న ఆ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. తాను తన తండ్రికి దూరంగా ఉండలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో ఆ యువతి పేర్కొంది. కాగా, తన కూతురిది ఆత్మహత్య కాదని, తనపై అత్యాచారానికి పాల్పడిన యజమాని జైలు నుంచి విడుదలైన తర్వాత తన కూతురిని లోబరుచుకున్నాడని, విషయం బయటపడుతుందనే భయంతో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని మృతురాలి మహిళ ఆరోపిస్తోంది. పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-01-03T19:10:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising