నా భార్య ఒప్పుకోవడం లేదు.. అందుకే చంపేశా.. పోలీసుల ముందు నిజం ఒప్పుకున్న భర్త.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-02-24T16:29:15+05:30
ఆ వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ కొడుకు కూడా ఉన్నాడు.. తాజాగా అతను తన ఇంట్లోనే భార్యను నరికి చంపాడు.. అనంతరం కొడుకును తీసుకుని పరారయ్యాడు.. పోలీసులకు దొరికిపోయి షాకింగ్ విషయాలు చెప్పాడు..
ఆ వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ కొడుకు కూడా ఉన్నాడు.. తాజాగా అతను తన ఇంట్లోనే భార్యను నరికి చంపాడు.. అనంతరం కొడుకును తీసుకుని పరారయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి నిందితుడి కోసం గాలింపులు ప్రారంభించాడు.. ఎట్టకేలకు పట్టుకుని విచారణ ప్రారంభించాడు.. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు కూడా షాకయ్యారు (Crime News).
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) జౌన్‌పూర్‌కు చెందిన అఫ్జల్ అనే వ్యక్తి ఐదేళ్ల క్రితం అఖిల (32) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. గ్రామంలో భార్యాబిడ్డలను వదిలేసి అఫ్జల్ అయోధ్యలో ఆటో నడుపుకునే వాడు. ఉన్నంతలో భార్యాబిడ్డలను బాగానే చూసుకునే వాడు. అయితే అఖిల ధనవంతుడైన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది (Extra Marital Affair). విషయం భర్తకు తెలిసి వారించినా ఆమె మాట వినలేదు. దీంతో భార్యను, కొడుకును తనతో పాటు తీసుకెళ్లాడు. అయినా అఖిల తీరులో మార్పు రాలేదు.
సీక్రెట్‌గా పోలీసులకు ఓ యువతి ఫోన్.. మా ఊళ్లో ఓ అబ్బాయిని చెట్టుకు కట్టేసి చచ్చేలా కొడుతున్నారంటూ సమాచారం.. వెళ్లి చూస్తే..
ప్రియుడితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూనే ఉండేది. తన భార్యను కలిసేందుకు ప్రియుడు తన ఇంటికి కూడా వస్తున్నట్టు అఫ్జల్‌కు అనుమానం వచ్చింది. భార్యను అడిగితే ఆమె ప్రియుడిని వదిలి ఉండలేనని తెగేసి చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన అఫ్జల్.. భార్యను గొడ్డలితో నరికి చంపేశాడు (Husband killed wife). అనంతరం కొడుకును తీసుకుని పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు అఫ్జల్‌ను పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Updated Date - 2023-02-24T16:29:17+05:30 IST