ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసినా రెండ్రోజుల తర్వాత మళ్లీ అదే నెంబర్ నుంచి కాల్.. అదే అతడి ప్రాణం తీసేసింది.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-02-25T18:53:39+05:30

ఆ వ్యక్తి వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి.. అతడు హోటల్‌లో ఫోన్ చేస్తుంటాడు.. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి నెలలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.. లిఫ్ట్ చేయగా అవతలి వైపు ఓ అమ్మాయి మాట్లాడింది.. రాంగ్ నెంబర్ అని కట్ చేస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ వ్యక్తి వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి.. అతడు హోటల్‌లో పని చేస్తుంటాడు.. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి నెలలో అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది.. లిఫ్ట్ చేయగా అవతలి వైపు ఓ అమ్మాయి మాట్లాడింది.. తనకు తెలియకపోవడంతో అతడు రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేశాడు.. రెండ్రోజుల తర్వాత అదే నెంబర్ నుంచి అతడికి మళ్లీ కాల్ వచ్చింది.. అతడిని మాటల్లోకి దించింది.. ఆమెతో అలా మాట్లాడడమే అతడి ప్రాణం పోవడానికి కారణమైంది.. మధ్యప్రదేశ్‌లోని (Madhya pradesh) రేవా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రేవాకు చెందిన కైలాష్ యాదవ్ జబల్‌పూర్‌లో ఒక హోటల్‌లో పనిచేసేవాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు గ్రామంలోనే ఉంటున్నారు. 2021 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కైలాష్ మొబైల్‌కు ఓ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా ఓ అమ్మాయి గొంతు వినిపించింది. రాంగ్ నంబర్ (Wrong Call) అని చెప్పి కైలాష్ ఫోన్ డిస్‌కనెక్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత మళ్లీ అదే నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈ సారి ఆ మహిళ కైలాష్‌ను మాటల్లోకి దించింది. మెల్లగా కైలాష్ కూడా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు (Extra Marital Affair). ఇద్దరూ రోజూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. తర్వాత ఆమెను నేరుగా కలిశాడు. ఆ తర్వాత పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు.

Viral Video: చనిపోయిన తల్లి కోసం తల్లడిల్లిన పిల్ల కోతి.. తల్లి చుట్టూ తిరుగుతూ రోదన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

వారానికి రెండు, మూడ్రోజులు పనికి సెలవు పెట్టి ఆమె ఇంటికి వెళ్లిపోయేవాడు. భార్య, పిల్లలను కూడా పట్టించుకోవడం మానేశాడు. రోజుల తరబడి ఆ మహిళ ఇంట్లోనే ఉండిపోయేవాడు. మొదట్లో ఆ మహిళ తన అవసరాన్ని బట్టి కైలాష్‌ను డబ్బులు అడిగేది. ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో కైలాష్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే కైలాష్ ఆదాయం చాలా తక్కువ. చివరకు ఆ మహిళ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. గతేడాది జూలైలో తనకు రూ.15 లక్షలు ఇవ్వాలని, లేకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరించడం ప్రారంభించింది. కైలాష్ డబ్బు ఇవ్వకపోవడంతో గతేడాది ఆగస్టు 18న అత్యాచారం కేసు పెట్టింది (Sexual Harassment).

పెళ్లికి వచ్చారు.. డాన్సులేశారు.. వధూవరులకు జీవితాంతం మర్చిపోలేని షాకిచ్చారు..!

విచారణ చేసిన పోలీసులు కైలాష్ యాదవ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దాదాపు 2 నెలల 10 రోజుల పాటు కైలాష్ జైలులోనే ఉన్నాడు. తర్వాత బెయిల్ పొంది 2022 నవంబర్ 1న జైలు నుంచి విడుదలయ్యాడు. కైలాష్ బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మహిళ ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించింది. డబ్బు ఇస్తే కేసు వాపసు తీసుకుంటానని చెప్పింది. అంత డబ్బు సమకూర్చడం కైలాష్‌కు కష్టమైంది. చివరకు గురువారం రాత్రి రేవా శివారులో ఉన్న ఓ మామిడి చెట్టుకు ఉరేసుకుని కైలాష్ చనిపోయాడు (Suicide). పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు (Crime News).

Updated Date - 2023-02-25T18:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising