ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amma odi: ఇంకా ‘ఒడి’ చేరలేదు? కారణం అడిగితే ఏం చెబుతున్నారంటే..!

ABN, First Publish Date - 2023-07-18T14:08:24+05:30

సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథక నిధులు జమ కాలేదు. అసలు ఈ డబ్బు ఖాతాల్లో జమ అవుతాయా లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లబ్ధిదారులకు జమ కావడం, మరికొంత మందికి డబ్బు పడకపోవడంతో డివిజన్లలో తిరుగుతున్న వలంటీర్లకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

లబ్ధిదారుల ఖాతాల్లో జమకాని నిధులు

డివిజన్లలో వలంటీర్ల నిలదీతలు

గతనెల 28న విడుదలైన అమ్మ ఒడి

ఈనెల 7...10...17.. తేదీలంటూ ప్రకటనలు

ఇప్పుడు ఇంకో పది రోజులంటూ సందేశాలు

వివరాల వెల్లడిలో అధికారుల గోప్యత

రామలింగేశ్వరనగర్‌కు చెందిన ఒక మహిళ పేరు అమ్మ ఒడి అర్హుల జాబితాలో ఉంది. వార్డు సచివాలయంలో ప్రదర్శించిన జాబితాలో ఆమె ఉన్నట్టు నిర్ధారించుకుంది. అర్హుల జాబితాలో పేరు ఉన్నా ఇప్పటి వరకు ఆమె ఖాతాలో పథకానికి సంబంధించిన నిధులు జమ కాలేదు.

గత నెల 28వ తేదీన సీఎం జగన్‌ అమ్మ ఒడి నిధులు విడుదల చేస్తే.. చాలామందికి ఇప్పటివరకు అసలు నగదు ఖాతాలో జమ కాలేదు. 7...10...17.. తేదీలంటూ ఇప్పటివరకు నాన్చిన అధికారులు తాజాగా సాంకేతిక సమస్యల దృష్ట్యా ఇంకో పది రోజుల సమయం అని చెబుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రోజులు గడుస్తున్నా ఇంకా చాలామంది లబ్ధిదారులకు అమ్మ ఒడి పథక నిధులు జమ కాలేదు. అసలు ఈ డబ్బు ఖాతాల్లో జమ అవుతాయా లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది లబ్ధిదారులకు జమ కావడం, మరికొంత మందికి డబ్బు పడకపోవడంతో డివిజన్లలో తిరుగుతున్న వలంటీర్లకు అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇంకా నిధులు జమకాని లబ్ధిదారులు వలంటీర్లను నిలదీస్తున్నారు. అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారిలో కొంతమందికి డబ్బు జమ అయ్యి, మిగిలిన వారికి ఎందుకు జమ కాలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ఏం సమాధానం చెప్పాలో వలంటీర్లకు పాలుపోవట్లేదు.

వివరాలెక్కడ..?

జిల్లాలో అమ్మ ఒడి పథకానికి 2023-24 విద్యా సంవత్సరంలో ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు, వారిలో ఎంతమందికి నిధులు జమయ్యాయి.. అనే వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతు న్నారు. గడిచిన నెల 28న అమ్మ ఒడి నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఆ రోజున సీఎం బటన్‌ నొక్కగానే నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతున్న ట్టు ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై చూపించింది. ఇలా ఖాతాలో నిధులు జమ అయిన వారి సంఖ్య కంటే, నిధులు జమకాని లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక డివిజన్‌లో పదిమంది లబ్ధిదారులను పలకరిస్తే, వారిలో ఆరు, ఏడుగురు తమకింకా అమ్మ ఒడి రాలేదని చెబుతున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద లేవంటే, తమ వద్ద లేవంటూ అటు విద్యాశాఖ అధికారులు, ఇటు సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు దాటవేత ధోరణితో వ్యవ హరిస్తున్నారు. చివరికి దీనికి సంబంధించిన వివరాలు జగన్‌ మానస పుత్రికలుగా చెబుతున్న సచివాలయా ల్లోనూ కనిపించడం లేదు. డివిజన్లలో నిలదీతలను భరించలేక వలంటీర్లు ఆ విషయాలను సచివాల యాల్లో ఉండే విద్యాశాఖ అసిస్టెంట్లకు వివరిస్తు న్నారు. అప్పుటికప్పుడు వారు తెలుగులో ఒక సందే శాన్ని టైపు చేసి వాట్సాప్‌ల్లోకి వదులుతున్నారు. వలంటీర్లు ఈ సందేశాన్నే లబ్ధిదారులకు పంపుతు న్నారు. గడిచిన నెల 28వ తేదీన అమ్మ ఒడి పథకం డబ్బు జమకాని వారికి రెండో తేదీన ఖాతాల్లో పడతా యని చెప్పుకొచ్చారు. తర్వాత ఆ గడువును ఏడో తేదీకి వాయిదా వేశారు. లబ్ధిదారులు డబ్బు కోసం పదేపదే వలంటీర్లకు ఫోన్లు చేస్తుండటంతో పదో తేదీన జమ అవుతాయని సందేశాలు పంపారు. తర్వాత ఆ తేదీని 17కు పొడిగించారు. సోమవారం నాటికి నిధులు జమకాని లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మ ఒడి డబ్బులు పడతాయని సందేశాలు పంపారు. కొంతమంది వలంటీర్లు ఫోన్లు చేసి సమాచారం చెప్పారు.

బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు

7...10...17... అమ్మ ఒడి నిధులు ఖాతాల్లో జమ కావడానికి వలంటీర్లు చెప్పిన గడువులు. అయినా డబ్బు జమ కాకపోవడంతో సచివాలయాల పరిధిలో కొత్త సందేశాలు తిరుగుతున్నాయి. బ్యాంకుల సర్వర్లలో సాంకేతిక సమస్యలు వచ్చా యని, ఆ సమస్యలు సరికావడానికి మరో పది రోజుల సమయం పడుతుందన్నది దాని సారాం శం. ఈ సమస్య పరిష్కారం కాగానే అమ్మ ఒడిలో మిగిలిన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని సందేశంలో పేర్కొన్నారు. అమ్మ ఒడి నిధులు విడుదల చేసినప్పటి నుంచి వాయుదాలు వేస్తుండటంతో కొంతమంది లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినప్పుడల్లా వాయిదా పెట్టి తమకు ఎగనామం పెట్టినట్టేనని పలువురు మహిళలు బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై సచివాలయాల్లోని విద్యాశాఖ అసిస్టెంట్లు నోరు మెదపడం లేదు. ప్రతి పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయగానే ఒక లింక్‌ ఉన్నతాధికారుల నుంచి వస్తుందని ఓ అసిస్టెంట్‌ చెప్పారు. ఈసారి అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొత్త లింక్‌ రాలేదని, పాత లింకే తమ వద్ద ఉందని చెబుతున్నారు. పథకంలో ఎంతమంది లబ్దిదారులకు నిధులు జమయ్యాయి, ఎంతమందికి జమకాలేదన్న విషయాన్ని ఉన్నతాదికారులు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.

Updated Date - 2023-07-18T14:08:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising