AP Tenth Supplementary: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయోచ్
ABN, First Publish Date - 2023-06-23T11:13:21+05:30
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1.9 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ రాశారు. ఆన్‌లైన్ విధానంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు
అమరావతి: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. 2.12 లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 1.9 లక్షల మంది మాత్రమే ఎగ్జామ్స్ రాశారు. ఆన్‌లైన్ విధానంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పాఠశాల లాగిన్‌లో సంబంధిత విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మార్కుల జాబితాలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
Updated Date - 2023-06-23T11:13:21+05:30 IST