ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ISRO: ఇస్రోలో ఉద్యోగం కోసం చూస్తున్నారా? పదో తరగతి అర్హతతో పోస్టులు.. జీతమెంతో తెలుసా?

ABN, First Publish Date - 2023-12-12T17:58:15+05:30

ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇస్రోలో పని చేయాలనేది మీ కలా? అయితే మీకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు తాజాగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శుభవార్త చెప్పింది. టెక్నీషియన్-బి ఉద్యోగాల భర్తీ కోసం ఇస్రో తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల (డిసెంబర్) 31వ తేదీ చివరి తేదీ. ఇస్రో ఆధ్వర్యంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) ఈ ఖాళీలను భర్తీ చేస్తుంది.

పోస్టులు:

తాజా జారీ చేసిన నోటిఫికేషన్‌లో టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) 33 పోస్టులు, టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) 8 పోస్టులు, టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) 9 పోస్టులు, టెక్నీషియన్-బి(ఫొటోగ్రఫీ)-2 పోస్టులు, టెక్నీషియన్-బి(డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్)-2 పోస్టులు భర్తీ కానున్నాయి.

వయో పరిమితి:

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ వర్గాల వారికి సడలింపులు ఉంటాయి.

అర్హతలు:

టెక్నీషియన్-బి(ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.

అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) నుంచి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎన్‌టీసీ లేదా ఎన్‌ఏసీ పూర్తిచేసి ఉండాలి.

టెక్నీషియన్-బి(ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తుదారులు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎన్‌సీవీటీ నుంచి ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ చదివి ఉండాలి.

టెక్నీషియన్-బి(ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) ఉద్యోగాలకు అయితే అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. ఎన్‌సీవీటీ నుంచి ఇన్‌స్ట్రూమెంట్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ/ఎన్‌టీసీ/ఎన్‌ఏసీ చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుమూ చెల్లించనక్కర్లేదు.

ఎంపిక ప్రక్రియ:

మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీటికి సంబంధించిన షెడ్యూల్‌ను NRSC త్వరలో ప్రకటిస్తుంది.

జీతం:

ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య ఉంటుంది. అలవెన్సులు అదనంగా లభిస్తాయి.

పూర్తి వివరాల కోసం https://www.nrsc.gov.in/ పోర్టల్‌ను సందర్శించండి.

Updated Date - 2023-12-12T17:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising