UPSC: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ABN, First Publish Date - 2023-06-12T14:39:23+05:30
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి మే 28న దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
ఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు (UPSC) విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి మే 28న దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరంతా ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ - 1 దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్పీ తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఫలితాలపై సందేహాల నివృత్తికి యూపీఎస్సీ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఈ నెంబర్లు 011-23385271, 011-23098543 లేదా 011-23381125 ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని యూపీఎస్సీ వెల్లడించింది.
Updated Date - 2023-06-12T14:39:23+05:30 IST