ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Scholarship Test: ప్రీ మెడికల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2023-04-06T12:32:18+05:30

వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్‌ వెలువడింది.

Scholarship Test
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంబీబీఎస్‌ సహా డెంటల్‌, హోమియో, యునానీ, ఆయుర్వేద విభాగాల్లో మెడికల్‌ డిగ్రీ కోర్సులు చేసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌, విదేశీ కాలేజీల్లో ప్రవేశం పొందినవారికి ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ప్రకారం విడివిడిగా స్కాలర్‌షి్‌పలు అందిస్తారు. పార్టిసిపేటింగ్‌ కళాశాలల వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

ఏఐపీఎంఎస్‌టీ 2023 వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రొఫిషియెన్సీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ ఒక్కోదానిలో 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఇంటర్‌/ పన్నెండో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 800. రుణాత్మక మార్కులు ఉన్నాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. మొబైల్స్‌, క్యాలిక్యులేటర్లు, లాగ్‌ టేబుల్స్‌, నోట్‌బుక్‌ తదితరాలను ఎగ్జామినేషన్‌ హాల్‌లోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్‌ కార్డు సహా వ్యక్తిగత గుర్తింపు పత్రాన్ని (డ్రైవింగ్‌ లైసెన్స్‌/ పాస్‌పోర్ట్‌/ పాన్‌ కార్డ్‌/ఓటర్‌ ఐడీ/ఆధార్‌ కార్డ్‌/స్కూలు లేదా కాలేజ్‌ ఐడీ కార్డు)తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.

స్కాలర్‌షిప్స్‌: ‘నీట్‌’లో అర్హత పొందిన అభ్యర్థులు ముందుగా మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేసుకోవాలి. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలను ఏఐపీఎంఎ్‌సటీ నిర్వహణ సంస్థకు సమర్పించాలి. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందినవారికి కోర్సుకు 16,000 మందికి చొప్పున మొత్తం 80,000 మందికి నిర్దేశిత స్కాలర్‌షి్‌పలు అందిస్తారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చేరిన 94,600 మందికి అవకాశం కల్పిస్తారు.

ప్రభుత్వ కాలేజీల్లో చేరినవారికి: స్కాలర్‌షిప్‌ టెస్టులో 90 శాతానికి మించి మార్కులు సాధించినవారిలో కోర్సుకు 1000 మందికి నాలుగేళ్లపాటు ట్యూషన్‌ ఫీజు ఇస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు వచ్చినవారిలో కోర్సుకు 5000 మందికి ఏడాదిపాటు ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. 70 నుంచి 80 శాతం మధ్య మార్కులు సాధించినవారిలో కోర్సుకు 10,000 మందికి స్టాండర్డ్‌ ల్యాప్‌టాప్‌ ఇస్తారు.

ప్రైవేట్‌ కాలేజీల్లో చేరిన ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు: స్కాలర్‌షిప్‌ టెస్టులో 90 శాతానికి మించి మార్కులు సాధించినవారిలో 100 మందికి ఏడాది పాటు ట్యూషన్‌ ఫీజు ఇస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు వచ్చినవారిలో 500 మందికి ఏడాదిపాటు 50 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. 70 నుంచి 80 శాతం మధ్య మార్కులు సాధించినవారిలో 10,000 మందికి స్టాండర్డ్‌ ల్యాప్‌టాప్‌ ఇస్తారు.

  • ప్రైవేట్‌ కాలేజీల్లో చేరిన బీడీఎస్‌/ బీఏఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీయూఎంఎస్‌ అభ్యర్థులకు: స్కాలర్‌షిప్‌ టెస్టులో 90 శాతానికి మించి మార్కులు సాధించినవారిలో కోర్సుకు 1000 మందికి ఏడాది పాటు ట్యూషన్‌ ఫీజు ఇస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు వచ్చినవారిలో కోర్సుకు 5000 మందికి ఏడాదిపాటు 50 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు. 70 నుంచి 80 శాతం మధ్య మార్కులు సాధించినవారిలో కోర్సుకు 15,000 మందికి స్టాండర్డ్‌ ల్యాప్‌టాప్‌ ఇస్తారు.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అర్హులే. అభ్యర్థులు 1997 అక్టోబరు 1(ఈ తేదీ సహా) తరవాత జన్మించి ఉండాలి. ‘నీట్‌’లో అర్హత సాధించి గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి.

ముఖ్య సమాచారం

ఫీజు: జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1450; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1250. జీఎ్‌సటీ అదనం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15

కరక్షన్‌ విండో ఓపెన్‌: మే 22 నుంచి 24 వరకు

అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడింగ్‌: మే 28 నుంచి

పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నర్సరావుపేట, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఆదిలాబాద్‌, గద్వాల, హయత్‌నగర్‌, జగిత్యాల, జనగాం, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సిద్దిపేట్‌, సూర్యాపేట, వరంగల్‌

డెమో ఎగ్జామినేషన్‌: జూన్‌ 1 నుంచి 4 వరకు

ఏఐపీఎంఎస్‌టీ(సెకండరీ) తేదీలు: జూన్‌ 10, 12, 14, 16

ఫలితాలు విడుదల: జూన్‌ 20న

వెబ్‌సైట్‌: aipmstsecondary.co.in

Updated Date - 2023-04-06T12:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising