ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notification: ఏపీ ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలు

ABN, First Publish Date - 2023-06-12T18:07:53+05:30

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)- ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ)- ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్‌కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంప్‌సలలో ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తున్నారు. ఇందులో మొదట రెండేళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) తరవాత నాలుగేళ్ల బీటెక్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌ మొత్తానికి 80 క్రెడిట్స్‌ నిర్దేశించారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పీయూసీ సబ్జెక్టులు: మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, తెలుగు/హిందీ/సంస్కృతం/ఫారిన్‌ లాంగ్వేజ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బయాలజీ

బీటెక్‌ విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌.

సీట్ల వివరాలు: ఒక్కో క్యాంప్‌సలో 1000 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల కోసం ప్రతి క్యాంప్‌సలో అదనంగా 10 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు నిర్దేశించారు.

అర్హత వివరాలు: ఈ ఏడాది ఏపీ/టీఎస్‌ ప్రభుత్వం నిర్వహించిన పదోతరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 4 శాతం వెయిటేజీ ఉంటుంది. సీబీఎ్‌సఈ/ఐసీఎ్‌సఈ అభ్యర్థులు కూడా అర్హులే.

ట్యూషన్‌ ఫీజు: పీయూసీ ప్రోగ్రామ్‌నకు ఏడాదికి రూ.45,000; బీటెక్‌ ప్రోగ్రామ్‌నకు ఏడాదికి రూ.50,000 చెల్లించాలి. నిబంధనల ప్రకారం విద్యా దీవెన ఫీ రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ట్యూషన్‌ ఫీజు కింద ఏడాదికి రూ.1,50,000లు చెల్లించాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 200

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 26

స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌: జూలై 5 నుంచి 9 వరకు

జనరల్‌ అభ్యర్థుల డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌: నూజివీడు, ఆర్‌కే వ్యాలీ క్యాంప్‌సలకు ఎంపికైన వారికి జూలై 21, 22; ఒంగోలు, శ్రీకాకుళం క్యాంప్‌సలకు ఎంపికైన వారికి జూలై 24, 25

డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ వేదికలు: నూజివీడు, ఆర్‌కే వ్యాలీ, శ్రీకాకుళం క్యాంప్‌సలు

వెబ్‌సైట్‌: www.rgukt.in

Updated Date - 2023-06-12T18:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising