ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Notification: క్యాట్‌ 2023 నోటిఫికేషన్‌.. స్కోర్ ఆధారంగానే..!

ABN, First Publish Date - 2023-08-01T18:13:07+05:30

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలలు సహా ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) 2023 నోటిఫికేషన్‌ వెలువడింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలలు సహా ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన స్కోర్‌ ఆధారంగా వివిధ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఎంబీఏ, పీజీపీ, పీహెచ్‌డీ, డాక్టోరల్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లలో చేరవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ద్వితీయ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డిగ్రీ స్థాయిలో 45 శాతం మార్కులు చాలు.

క్యాట్‌ వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో వెర్బల్‌ ఎబిలిటీ అండ్‌ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, రెండో సెక్షన్‌లో డేటా ఇంట్రప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌, మూడో సెక్షన్‌లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు నిర్దేశించారు.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2400; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2 నుంచి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 13

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: అక్టోబరు 25 నుంచి నవంబరు 26 వరకు

క్యాట్‌ 2023 తేదీ: నవంబరు 26

వెబ్‌సైట్‌: www.iimcat.ac.in

Updated Date - 2023-08-01T18:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising