ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CUET Notification: సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రవేశాలు.. ఈ భాషల్లో పరీక్షలు!

ABN, First Publish Date - 2023-02-11T16:50:51+05:30

దేశవ్యాప్తం (India)గా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీ (Central University)లు సహా పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు (Deemed Universities), అటానమస్‌ కళాశాలలు, ప్రభుత్వ/ ప్రైవేట్‌

ఈ భాషల్లో పరీక్షలు!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తం (India)గా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీ (Central University)లు సహా పార్టిసిపేటింగ్‌ యూనివర్సిటీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు (Deemed Universities), అటానమస్‌ కళాశాలలు, ప్రభుత్వ/ ప్రైవేట్‌ యూనివర్సిటీలు అందిస్తున్న అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ (Undergraduate programme)లలో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ 2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency) (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చు. అభ్యర్థులు కనిష్ఠంగా మూడు, గరిష్ఠంగా పది సబ్జెక్టులలో పరీక్ష రాసే వీలుంది. సింగిల్‌ విండో విధానం ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు/ చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా పూర్తిచేసినవారు; హయ్యర్‌ సెకండరీ సర్టిఫికెట్‌ ఒకేషనల్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు; జనరల్‌ సర్టిఫికెట్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామినేషన్‌ అడ్వాన్స్‌డ్‌ లెవెల్‌ పూర్తిచేసినవారు; కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ నుంచి హైస్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.

సీయూఈటీ యూజీ 2023 వివరాలు: ఇది కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌. అన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌లో సెక్షన్‌ 1 ఏ, సెక్షన్‌ 1 బీల వారీగా లాంగ్వేజ్‌ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఒకాబులరీలకు సంబంధించి 50 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రెండో సెక్షన్‌లో డొమైన్‌ సబ్జెక్ట్‌ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో ఇంటర్‌/ పన్నెండోతరగతి సిలబస్‌ ఆధారంగా 45 లేదా 50 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 35 లేదా 40 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. మూడో సెక్షన్‌లో జనరల్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, లాజికల్‌ అండ్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ అంశాలనుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో 50 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

  • ప్రశ్నకు అయిదు మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు.

  • సెక్షన్‌ 1ఏ లాంగ్వేజ్‌లు: ఇంగ్లీష్‌, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ

సెక్షన్‌ 1బీ లాంగ్వేజ్‌లు: అరబిక్‌, బోడో, చైనీస్‌, డోగ్రీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌, కశ్మీరీ, కొంకణి, మైథిలి, మణిపురి, నేపాలీ, పర్షియన్‌, రష్యన్‌, సంతాలీ, సింధీ, స్పానిష్‌, టిబెటన్‌, సంస్కృతం.

డొమైన్‌ సబ్జెక్టులు: అకౌంటెన్సీ/ బుక్‌ కీపింగ్‌, అగ్రికల్చర్‌, ఆంత్రోపాలజీ, బయాలజీ/బయలాజికల్‌ స్టడీస్‌/ బయోటెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ, బిజినెస్‌ స్టడీస్‌, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మాటిక్స్‌ ప్రాక్టీసెస్‌, ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌, ఇంజనీరింగ్‌ గ్రాఫిక్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఫైన్‌ ఆర్ట్స్‌/ విజువల్‌ ఆర్ట్స్‌/ కమర్షియల్‌ ఆర్ట్‌, జాగ్రఫీ/ జియాలజీ, హిస్టరీ, హోం సైన్స్‌, నాలెడ్జ్‌ ట్రెడిషన్‌ ప్రాక్టీసెస్‌ ఇన్‌ ఇండియా, లీగల్‌ స్టడీస్‌, మాస్‌ మీడియా/ మాస్‌ కమ్యూనికేషన్‌, మేథమెటిక్స్‌/ అప్లయిడ్‌ మేథమెటిక్స్‌, పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌/ నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌/ యోగా, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, సైకాలజీ, సంస్కృతం, సోషియాలజీ, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌.

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు:

  • మూడు సబ్జెక్టులకుగాను జనరల్‌ అభ్యర్థులకు రూ.750; ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.700; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.650 చెల్లించాలి

  • ఏడు సబ్జెక్టులకుగాను జనరల్‌ అభ్యర్థులకు రూ.1500; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1400;దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1300 చెల్లించాలి

  • పది సబ్జెక్టులకుగాను జనరల్‌ అభ్యర్థులకు రూ.1750; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1650; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1550 చెల్లించాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 12

కరక్షన్‌ విండో ఓపెన్‌: మార్చి 15 నుంచి 18 వరకు

ఎగ్జామినేషన్‌ సెంటర్‌ వివరాలు వెల్లడి: ఏప్రిల్‌ 30న

అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడింగ్‌: మే రెండో వారంలో

సీయూఈటీ యూజీ 2023 తేదీలు: మే 21 నుంచి 31 వరకు (రిజర్వ్‌ తేదీలు జూన్‌ 1 నుంచి 7 వరకు)

వెబ్‌సైట్‌: https://cuet.samarth.ac.in/

Updated Date - 2023-02-11T16:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising