మ్యాట్ 2023 సెప్టెంబరు నోటిఫికేషన్
ABN, First Publish Date - 2023-07-15T12:42:22+05:30
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) 2023 సెప్టెంబరు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ)-మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) 2023 సెప్టెంబరు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంబీఏ, పీజీడీఎం తదితర ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్స్ పొందవచ్చు. మ్యాట్‌ను ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్, పేపర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాల్లో నిర్వహిస్తారు. వీటిలో ఒకదాన్ని లేదా రెంటిని అభ్యర్థులు ఎంచుకోవచ్చు. పీబీటీ, సీబీటీలకు పరీక్ష కేంద్రాలు వేరుగా ఉంటాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
మ్యాట్ వివరాలు: దీనిని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్, మేథమెటిక్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ సఫిషియెన్సీ, ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్లో 40 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ఐబీటీ షెడ్యూల్: సెప్టెంబరు 2న ఎగ్జామ్ రాయాలనుకొనేవారు ఆగస్టు 30 లోపు, సెప్టెంబరు 9న పరీక్ష రాయాలనుకొనేవారు సెప్టెంబరు 6 లోపు, సెప్టెంబరు 10న పరీక్ష రాయాలంటే సెప్టెంబరు 7లోపు, సెప్టెంబరు 16న రాయాలంటే సెప్టెంబరు 13 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ తరవాత రోజు నుంచి అడ్మిట్ కార్డ్‌లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పీబీటీ షెడ్యూల్
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 29
అడ్మిట్ కార్డ్‌ల డౌన్లోడింగ్: ఆగస్టు 31 నుంచి
పరీక్ష కేంద్రం: హైదరాబాద్
పీబీటీ టెస్ట్ తేదీ: సెప్టెంబరు 3
సీబీటీ షెడ్యూల్
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 12
అడ్మిట్ కార్డ్‌ల డౌన్లోడింగ్: సెప్టెంబరు 14 నుంచి
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం
సీబీటీ టెస్ట్ తేదీ: సెప్టెంబరు 17
దరఖాస్తు ఫీజు: ఒక టెస్ట్(ఐబీటీ/పీబీటీ/ సీబీటీ)నకు రూ.1950; రెండు టెస్ట్‌లు అంటే డబుల్(ఐబీటీ/పీబీటీ/ సీబీటీ) లేదా (పీబీటీ + ఐబీటీ)/ (పీబీటీ+సీబీటీ)/(సీబీటీ+ఐబీటీ)లకు రూ.3,100.
వెబ్సైట్: mat.aima.in
Updated Date - 2023-07-15T12:42:22+05:30 IST