ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంబీఏ కోర్సు.. ఎవరికి అవకాశం అంటే..!

ABN, First Publish Date - 2023-09-01T12:38:38+05:30

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌)-‘మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ)’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్‌.

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్‌)-‘మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ)’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్‌. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఎమ్మెస్సీ/ఎంసీఏ మొదటి సంవత్సర కోర్సులు చదువుతున్నవారు ఈ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. అభ్యర్థులు ప్రస్తుతం చదువుతున్న కాలేజీలో ఆఫ్‌లైన్‌ తరగతులు, జెన్‌టీయూహెచ్‌ నుంచి ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఉంటాయి. అటానమస్‌, నాన్‌ అటానమస్‌, జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ కళాశాలలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి కాలేజ్‌లో సెక్షన్‌కు 30 మంది ఉండేలా పలు సెక్షన్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించాలి.

ప్రోగ్రామ్‌ వివరాలు

ఊ ఇందులో డేటా అనలిటిక్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, లీగల్‌ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ తదితర అంశాలు బోధిస్తారు.

  • ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు సంబంధించిన ఫంక్షనల్‌ నాలెడ్జ్‌; బిజినెస్‌ ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేయడానికి కావాల్సిన టెక్నాలజీలపై శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌గా ఎదిగేందుకు అవసరమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పిస్తారు. మేనేజ్‌మెంట్‌ విధి విధానాలు, కాన్సె్‌ప్టలు, ప్రిన్సిపల్స్‌ తదితరాలపై అవగాహన కల్పిస్తారు.

కళాశాలలు తమ ఆమోదాన్ని తెలిపేందుకు చివరి తేదీ: సెప్టెంబరు 30

సెమిస్టర్‌ ఫీజు: రూ.25,000

అభ్యర్థులు సెమిస్టర్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 30

వెబ్‌సైట్‌: www.jntuh.ac.in

Updated Date - 2023-09-01T12:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising