NIT Warangalలో ఎంబీఏ నోటిఫికేషన్.. ప్రవేశం ఎలా అంటే..!
ABN, First Publish Date - 2023-05-24T17:57:57+05:30
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ వరంగల్) ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - ఎంబీఏ ప్రోగ్రామ్ ఫేజ్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌ను
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్ వరంగల్) ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ - ఎంబీఏ ప్రోగ్రామ్ ఫేజ్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌ను ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రత్యేకించారు. ఇది రెండేళ్ల వ్యవధిగల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. మొత్తం 28 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్ రూం టీచింగ్, కేస్ స్టడీస్, ఫీల్డ్ ఎక్స్‌పీరియెన్సెస్, ప్రజంటేషన్స్, స్టూడెంట్ సెమినార్‌లు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, వైవా వోస్, ఎగ్జామినేషన్స్ ఉంటాయి. జాతీయ పరీక్ష స్కోర్, అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్ ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు సెప్టెంబరు 15 నాటికి డిగ్రీ సర్టిఫికెట్, మార్కుల పత్రాలు సబ్మిట్ చేయాలి. క్యాట్/ మ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 19
జీడీ, ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల: జూన్ 22
గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు: జూలై 3
ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదల: జూలై 5
వెబ్‌సైట్: www.nitw.ac.in
Updated Date - 2023-05-24T17:57:57+05:30 IST