Notification: ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు
ABN, First Publish Date - 2023-11-24T17:06:18+05:30
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న డా.బీ.ఆర్ అంబేద్కర్ చెయిర్ విభాగం- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న డా.బీ.ఆర్ అంబేద్కర్ చెయిర్ విభాగం- పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ స్పెషలైజేషన్ ‘డిజిటల్ ఇండియా, హ్యూమన్ అడ్వాన్స్‌మెంట్, మల్టీడిసిప్లినరీ థాట్స్ & అంబేద్కర్’. ఇది ఫుల్ టైం రెగ్యులర్ ప్రోగ్రామ్. రెండు సీట్లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌ను డా.అంబేద్కర్ డాక్టోరల్ ఫెలోషిప్ స్కీం కింద నిర్వహిస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డా.అంబేద్కర్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. నిబంధనల ప్రకారం మరో ఏడాది పొడిగించే వీలుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000ల ఫెలోషిప్ ఇస్తారు.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్/సీఎ్‌సఐఆర్ నెట్/స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750; ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250
దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: డిసెంబరు 15
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, వాల్తేర్ రోడ్, ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం-530003
వెబ్‌సైట్: andhrauniversity.edu.in
Updated Date - 2023-11-24T17:06:19+05:30 IST