ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: డా.వైఎస్సార్‌ వర్సిటీలో యూజీ ఆయుష్‌ మేనేజ్‌మెంట్‌ కోటా

ABN, First Publish Date - 2023-11-11T17:35:19+05:30

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (డావైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ ఆయుష్‌ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి

విజయవాడలోని డా.వైఎస్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (డావైఎస్సార్‌యూహెచ్‌ఎస్‌)- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ అన్‌-ఎయిడెడ్‌ నాన్‌ మైనారిటీ ఆయుష్‌ డిగ్రీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ యూజీ 2023 స్కోర్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్‌ సబ్జెక్టుల్లో జనరల్‌ అభ్యర్థులకు కనీసం 50 శాతం; జనరల్‌ కేటగిరి దివ్యాంగులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.

నీట్‌ యూజీ 2023 కటాఫ్‌ స్కోర్‌: మొత్తం 720 మార్కులకుగాను జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 137; జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల దివ్యాంగులకు 121; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 107 మార్కులను కటాఫ్‌ స్కోర్‌గా నిర్దేశించారు.

ప్రైవేట్‌ కాలేజీలు-మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు

  • మహారాజా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియో మెడికల్‌ కాలేజ్‌, విజయనగరం - 42 సీట్లు

  • కేకేసీ హోమియోపతి మెడికల్‌ కాలేజ్‌, పరమేశ్వర మంగళం, పుత్తూరు, చిత్తూరు జిల్లా - 25 సీట్లు

  • శ్రీ ఆది శివ సద్గురు ఆలీ సాహెబ్‌ శివార్యుల హోమియోపతిక్‌ మెడికల్‌ కాలేజ్‌, గుంతకల్‌ - 42 సీట్లు

  • శ్రీ ఆది శివ సద్గురు ఆలీ సాహెబ్‌ శివార్యుల ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కాలేజ్‌, గుంతకల్‌ - 42 సీట్లు

ముఖ్య సమాచారం

యూనివర్సిటీ ఫీజు: రూ.8,600

ట్యూషన్‌ ఫీజు: ఏడాదికి రూ.24,500

దరఖాస్తు ఫీజు: రూ.3,540

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 11న సాయంత్రం ఆరు గంటల వరకు

దరఖాస్తుతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాలు: నీట్‌ యూజీ 2023 ర్యాంక్‌ కార్డ్‌; అభ్యర్థి ఫొటో, సంతకం; పదోతరగతి, ఇంటర్‌ సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్‌ వరకు స్టడీ సర్టిఫికెట్‌లు; టీసీ; ఆధార్‌ కార్డ్‌.

వెబ్‌సైట్‌: drysruhs.edu.in

Updated Date - 2023-11-11T17:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising