ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌.. అర్హత సాధించాలంటే..!

ABN, First Publish Date - 2023-05-13T13:02:38+05:30

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)-యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (యూజీసీ నెట్‌) జూన్‌ 2023కి దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న

Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)-యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (యూజీసీ నెట్‌) జూన్‌ 2023కి దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషి‌ప్‌నకు నెట్‌ అర్హత తప్పనిసరి. ఎన్‌ఎఫ్‌ఎస్సీ, ఎన్‌ఎఫ్‌ఓబీసీ, ఎన్‌ఎఫ్‌పీడబ్ల్యూడీ ఫెలోషి‌ప్‌లకు కూడా నెట్‌ అర్హతనే ప్రామాణికంగా తీసుకొంటారు. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఈ టెస్ట్‌ని నిర్వహిస్తున్నారు.

అర్హత: హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజ్‌ లు సహా), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌, ఎలకా్ట్రనిక్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులు; ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్దమౌతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌)నకు అప్లయ్‌ చేసుకొనే అభ్యర్థుల వయసు జూన్‌ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతకు అప్లయ్‌ చేసుకొనే అభ్యర్థులకు వయోపరిమితి నిబంధనలు లేవు.

యూజీసీ నెట్‌: దీనిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. రెంటిలో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలే ఇస్తారు. మొదటి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థికి ఉన్న టీచింగ్‌/ రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, డైవర్జెంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలకు సంబంధించి 50 ప్రశ్నలు అడుగుతారు. రెండో పేపర్‌ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఎంచుకొన్న సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లలో ఒక్కో ప్రశ్నకు రెం డు మార్కులు కేటాయించారు. నెగెటివ్‌ మార్కులు లేవు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రాన్ని హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో ఇస్తారు.

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1150; ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.325

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31

ఆన్‌లైన్‌ దరఖాస్తులో కరక్షన్స్‌: జూన్‌ 2, 3

యూజీసీ నెట్‌ జూన్‌ 2023 తేదీలు: జూన్‌ 13 నుంచి 22 వరకు

వెబ్‌సైట్‌: www.nta.ac.in, www.ugc.ac.in

Updated Date - 2023-05-13T13:02:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising