Jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ఐడీబీఐ బ్యాంకులో కొలువులు
ABN, First Publish Date - 2023-11-24T17:18:54+05:30
ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు 2100
ఇండస్ట్రియల్ డెవల్‌పమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్(జేఏఎం), గ్రేడ్ ‘ఒ’
ఖాళీలు: 800(ఎస్సీ-120, ఎస్టీ-60, ఓబీసీ-216, ఈడబ్ల్యూఎస్-80, యూఆర్-324)
2. ఎగ్జిక్యూటివ్-సేల్స్ అండ్ ఆపరేషన్స్(ఈఎ్‌సవో)(ఒప్పంద ప్రాతిపదికన)
ఖాళీలు: 1300(ఎస్సీ-200, ఎస్టీ-86, ఓబీసీ-326, ఈడబ్ల్యూఎస్-130, యూఆర్-558)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2023 నవంబరు 1 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
జీతభత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 - రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000 - రూ.31,000
దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 6
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు డిసెంబరు 31, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిసెంబరు 30
వెబ్‌సైట్: www.idbibank.in/idbibankcareerscurrentopenings.aspx
Updated Date - 2023-11-24T17:26:16+05:30 IST