Jobs: విజయవాడ ఆకాశవాణిలో కొలువులు
ABN, First Publish Date - 2023-10-20T17:00:04+05:30
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ...కింద పేర్కొన్న జిల్లాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన
విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ...కింద పేర్కొన్న జిల్లాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
జిల్లాలు: విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎ్‌సఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ-అమరావతి.
అర్హత: డిగ్రీతో పాటు న్యూస్ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్/వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి: 24 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా ప్రకారం వివరాలు పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లతో హెడ్ ఆఫ్ ఆఫీస్, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 30
వెబ్‌సైట్: prasarbharati.gov.in/pbvacancies/
Updated Date - 2023-10-20T17:00:04+05:30 IST