Scholarships: ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్.. ఎవరు అర్హులంటే..!
ABN, First Publish Date - 2023-12-01T17:47:32+05:30
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)-2023 విద్యా సంవత్సరానికి గాను ‘ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్’ ప్రకటనను విడుదల చేసింది.
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)-2023 విద్యా సంవత్సరానికి గాను ‘ప్రగతి స్కాలర్‌షిప్ స్కీమ్’ ప్రకటనను విడుదల చేసింది. మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు దీనిని ఉద్దేశించారు. డిప్లొమా కోర్సులు చదువుతున్న మహిళలకు ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కాలర్‌షి్‌పల సంఖ్య: దేశ వ్యాప్తంగా 5,000 స్కాలర్‌షి్‌పలు అందుబాటులో ఉన్నా యి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు 318, తెలంగాణకు 206 కేటాయించారు.
స్కాలర్‌షిప్ మొత్తం: టెక్నికల్ డిప్లొమా రెగ్యులర్ కోర్సులో చేరినవారికి మూడేళ్లు, లేటరల్ ఎంట్రీ అభ్యర్థుకు రెండేళ్లపాటు ఏటా రూ.50,000 అందజేస్తారు.
అర్హత: ఏదైనా టెక్నికల్ డిప్లొమా లెవల్ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా రెండో సంవత్సరం ప్రవేశాలు పొందిన అభ్యర్థులు కూడా అర్హులే. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31.
వెబ్‌సైట్: https://scholarships.gov.in/
Updated Date - 2023-12-01T17:47:33+05:30 IST