ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NPTI: పవర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమాలు

ABN, First Publish Date - 2023-05-29T17:46:50+05:30

నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌పీటీఐ)-పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Notification
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫరీదాబాద్‌లోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌పీటీఐ)-పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫరీదాబాద్‌, న్యూఢిల్లీ, నంగల్‌, నైవేలీ, దుర్గాపూర్‌, నాగ్‌పూర్‌, బెంగళూరు, శివపురి, అలప్పుజా, గువహటీ క్యాంప్‌సలలో మొత్తం 640 సీట్లు ఉన్నాయి. అకడమిక్‌ మెరిట్‌, టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్‌ల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సౌకర్యం ఉంది.

పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఈ కోర్సు పవర్‌ ప్లాంట్‌లకు సంబంధించిన ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ అంశాలు వివరిస్తుంది. అన్ని క్యాంప్‌సలలో కలిపి మొత్తం 300 సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రిడ్‌ ఇంటర్ఫేస్‌ టెక్నాలజీస్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో ఎనర్జీ సిస్టమ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ సోర్సులకు సంబంధించిన టెక్నాలజీ, ఎకనామిక్స్‌, పాలసీ తదితర అంశాలు ఉంటాయి. సోలార్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, థర్మల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, విండ్‌ ఎనర్జీ, బయోమాస్‌, జియోథర్మల్‌, టైడల్‌ వేవ్‌ ఎనర్జీ, గ్రిడ్‌ ఇంటిగ్రేషన్‌, ఇంటర్ఫేసింగ్‌ టెక్నాలజీస్‌ అంశాలు వివరిస్తారు. ఈ కోర్సులో 280 సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ హైడ్రో పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌: ప్రోగ్రామ్‌ వ్యవధి తొమ్మిది నెలలు. ఇందులో హైడ్రో పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌, ఓ అండ్‌ ఎం, ఎరెక్షన్‌, కమిషనింగ్‌, మేనేజ్‌మెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ-టారీఫ్‌ తదితర అంశాలు ఉంటాయి. ఈ కోర్సులో 60 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో(బీఈ/బీటెక్‌)(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/సీ్క్షఐ/పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌కు 90 శాతం, ఇంటర్వ్యూ స్కోర్‌కు 10 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. తరవాత కౌన్సెలింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 24

టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలు: జూలై 26, 27

అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ విడుదల: జూలై 28న

కౌన్సెలింగ్‌: ఆగస్టు 1, 2

కోర్సులు ప్రారంభం: ఆగస్టు 7 నుంచి

సీట్లు మిగిలిన పక్షంలో స్పాట్‌ అడ్మిషన్స్‌: ఆగస్టు 17న

వెబ్‌సైట్‌: www.npti.gov.in

Updated Date - 2023-05-29T17:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising