Notification: ఎన్.జీ.రంగా వర్సిటీలో ఎన్‌ఆర్‌ఐ కోటా నోటిఫికేషన్
ABN, First Publish Date - 2023-10-13T12:56:31+05:30
గుంటూరులోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)-ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలయింది.
గుంటూరులోని ఆచార్య ఎన్.జీ.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)-ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ విడుదలయింది. దీని ద్వారా బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్/ కమ్యూనిటీ సైన్స్), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/ ఫుడ్ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లలో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్/బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/పన్నెండో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సుకు బయాలజీ, బీటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)కు మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. 2023 డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొన్న దరఖాస్తు ఫారాన్ని నింపి ఇంటర్, పదోతరగతి మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్, ఎన్‌ఆర్‌ఐ వీసా-పా్‌సపోర్ట్-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కేటగిరీ అభ్యర్థులు తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్, స్పాన్సరర్ ధ్రువీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాలి.
ముఖ్య సమాచారం
దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 21
చిరునామా: రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లాం, గుంటూరు - 522034
వెబ్‌సైట్: angrau.ac.in
Updated Date - 2023-10-13T12:56:31+05:30 IST