ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ద్రావిడ వర్సిటీలో జరిగిన అక్రమాలపై కమిటీ ఏం తేల్చిందంటే..!

ABN, First Publish Date - 2023-08-23T12:43:25+05:30

కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్‌ డిగ్రీల ప్రదానంలో జరిగిన అవకతవకలపై ఏళ్ల తరబడి జరుగుతున్న విచారణ ఒక కొలిక్కి వచ్చింది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని విచారణకు నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ శేషశయనారెడ్డి సమర్పించిన నివేదికను

ఆ ఇద్దరు వీసీలదే బాధ్యత!

కుప్పం, ఆగస్టు 22: కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్‌ డిగ్రీల ప్రదానంలో జరిగిన అవకతవకలపై ఏళ్ల తరబడి జరుగుతున్న విచారణ ఒక కొలిక్కి వచ్చింది. అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని విచారణకు నియమించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ శేషశయనారెడ్డి సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుత వీసీ ఆచార్య తుమ్మల రామకృష్ణను, పూర్వ వీసీ ఈడిగ సత్యనారాయణను అందుకు బాధ్యులుగా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి పేరుతో విడుదలైన రాజపత్రం వర్సిటీ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. పూర్వాపరాలిలా ఉన్నాయి.

ద్రావిడ విశ్వవిద్యాల అధికార వర్గాలు ఈసీ అనుమతి లేకుండా ఏకంగా 356 పీహెచ్‌డీ పట్టాలు ప్రదానం చేశారన్న ఆరోపణలపై తొలుత 2010-11 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వం టూమెన్‌ కమిటీని నియమించింది. ఇచ్చిన పట్టాలను రద్దు చేయమంటూ ఆ కమిటీ సిఫార్సు చేసింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అప్పటికే సమర్పించిన థీసి్‌సలను ప్రాసెస్‌ చేయమని, అయితే తుది తీర్పుకు వెలువడేదాకా పట్టాలను ప్రదానం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. దీంతో వర్సిటీ అధికారులు వైవా నిర్వహించినా, పట్టాలు ప్రదానం చేయలేదు. దీనిపై కొంతమంది విద్యార్థులు మళ్లీ హైకోర్టు గుమ్మం తొక్కారు. కోర్టు తీర్పును ఆధారం చేసుకుని 2015-18 మధ్యకాలంలో అప్పటి వీసీలు పీహెచ్‌డీ పట్టాలు ఇవ్వడం ప్రారంభించారు. దీనిపై అభ్యంతరాలు వెల్లువెత్తడంతో అనంతరం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అన్ని పరిశీలనలూ పూర్తయి తగిన అర్హత కలిగిన వారికి 2021నుంచి పట్టాలు ప్రదానం చేయడం ప్రారంభించారు. ఈసీ అనుమతి లేకుండా పట్టాలు ప్రదానం చేయడంపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. మొత్తమ్మీద ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలు, ఎంఫిల్‌ల ప్రదానం విషయంలో తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటిపై విచారించి నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డిని విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌ 24వ తేది ద్రావిడ విశ్వవిద్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ప్రస్తుత వీసీ తుమ్మల రామకృష్ణ, పూర్వ వీసీలు ఈడిగ సత్యనారాయణ, ఎడ్ల సుధాకర్‌, కడప రమణయ్య, ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో విచారణకు హాజరయ్యారు.

అక్రమాలు వాస్తవమే!

ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనంటూ జస్టిస్‌ శేషశయనారెడ్డి ఇచ్చిన నివేదికను ఆమోదించిన ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి పేరుతో ఈనెల 21వ తేదీన రాజపత్రం విడుదల చేసింది. ఎంఫిల్‌, పీహెచ్‌డీల ప్రదానం చేయడంలో అప్పటి వీసీలు, ప్రస్తుత వీసీ, ఇతరులు హైకోర్టు ఉత్తర్వులను, యూజీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్న అంశాన్ని ఈ రాజపత్రంలో ప్రస్తావించారు. ప్రస్తుత వీసీ తుమ్మల రామకృష్ణ, మాజీ వీసీ ఈడిగ సత్యనారాయణ నిర్లక్ష్యం, అజాగ్రత్తలే దీనికి కారణమన్నారు. నోటిఫికేషన్‌ను ఆమోదించడంలో కూడా వారిద్దరూ తమ ఽఅధికారాన్ని దుర్వినియోగం చేశారని విచారణ నివేదిక తేల్చిన విషయాన్ని పేర్కొంది. ‘విచారణ కమిటీ నివేదికను ఉన్నదన్నట్లు ఆమోదించాం. ద్రావిడ విశ్వవిద్యాలయ చట్టం 1997 సెక్షన్‌ 11 (1ఎ) ప్రకారం మీపై (ప్రస్తుత వీసీ రామకృష్ణ, మాజీ వీసీ ఈడిగ సత్యనారాయణ) తాత్కాలికంగా చర్య తీసుకోవాలని నిర్ణయించాము’ అని స్పష్టంగా పేర్కొంది. ‘ఈ లేఖ అందిన 15 రోజుల్లోపు మీరు చెప్పుకోవాల్సిన వివరణ ఏదన్నా ఉంటే చెప్పుకోవాలని ఆదేశిస్తున్నాను. నిర్ణీత గడువులోగా ఎలాంటి ప్రత్యుత్తరము రాకపోతే విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ద్రావిడ విశ్వవిద్యాలయ చట్టం 1997లోని సెక్షన్‌ 11లో గల సబ్‌ సెక్షన్‌ (1ఎ) కింద అధికారాలను ఉపయోగించి ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ పదవినుంచి తొలగిస్తూ చర్యలు తీసుకుంటాము’ అని రాజపత్రంలో ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-23T12:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising