ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉన్నత విద్యాసంస్థల్లో బోధనపై యూజీసీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2023-07-06T12:29:51+05:30

ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ వెనక్కి తీసుకుంది. ఈ పోస్టులకు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కనీస అర్హతగా యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 5: ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ వెనక్కి తీసుకుంది. ఈ పోస్టులకు నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ లేదా స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కనీస అర్హతగా యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ప్రకటించారు. ‘‘అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు పీహెచ్‌డీ అవసరం లేదని మేము భావిస్తున్నాం. దాని వల్ల ప్రతిభ ఉన్నవారు విద్యాబోధనకు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం’’ అని ఆయన తెలిపారు. 2018లో విద్యాసంస్థల్లో నియామకాలకు సంబంధించి ప్రమాణాలను నిర్ణయిస్తూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకానికి పీహెచ్‌డీని యూజీసీ తప్పనిసరి చేసింది. పీహెచ్‌డీని పూర్తి చేసేందుకు అభ్యర్థులకు మూడేళ్ల సమయాన్ని ఇస్తూ, 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని భావించింది. అయితే కొవిడ్‌ మహమ్మారి ప్రభావంతో పీహెచ్‌డీ విద్యార్థుల పరిశోధనలు నిలిపోయిన నేపథ్యంలో యూజీసీ ఆ గడువును జూలై 2023 వరకు పొడిగించింది. ఇప్పుడు పీహెచ్‌డీనే అవసరం లేదని ప్రకటించింది.

Updated Date - 2023-07-06T12:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising