Headache: ఈ చిట్కాలుతో తలనొప్పిని తరిమేయొచ్చు! అవేంటంటే..!
ABN, First Publish Date - 2023-08-22T12:59:53+05:30
ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరీ త్యాగి తలనొప్పులకు సులువైన, ఫలవంతమైన చిట్కాలు కొన్ని సూచించారు. అవేంటంటే...
ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ధన్వంతరీ త్యాగి తలనొప్పులకు సులువైన, ఫలవంతమైన చిట్కాలు కొన్ని సూచించారు. అవేంటంటే...
బ్రహ్మి: చల్లబరిచే ఈ మూలిక ఒత్తిడి, మానసిక కుంగుబాటులను వదిలిస్తుంది. కాబట్టి ఈ కారణంగా తలెత్తే తలనొప్పుల కోసం బ్రహ్మిలో నెయ్యి కలిపి కొన్ని చుక్కలను ముక్కు రంరఽథాల్లో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
గంధం: ఇది పురాతనమైన చిట్కా. గంధం నూరి నుదుటికి పట్టు వేయాలి. ఇందుకోసం అర చెంచా గంధం పొడికి కొన్ని చుక్కల నీళ్లు కలిపి వతుుద్దలా చేసి నుదుటి మీద 20 నిమిషాల పాటు పట్టు వేసుకోవాలి.
తగర్: ఈ మూలికకు దీర్ఘ చరిత్ర ఉంది. దీన్ని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సల్లో వాడుతూ ఉన్నారు. దీనికి ఉన్న ఔషధగుణాలు అమోఘమైనవి. దీన్ని ఔషధగుణాలు కలిగిన నూనెలతో కలిపి మర్దన చేయడం లేదా తేనీటిలో కలిపి సేవించడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
యాలకులు: తలనొప్పులను తగ్గించుకోవడం కోసం యాలకులు నమలాలి.
రాతి ఉప్పు: సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడకం మొదలుపెడితే పలు రకాల తలనొప్పులు తగ్గుతాయి. గోరువెచ్చని నీటిలో చిటికెడు రాతి ఉప్పు కలిపి తాగడం వల్ల తలనొప్పులు తగ్గుతాయి.తలనొప్పిని తరిమేద్దాం!
Updated Date - 2023-08-22T12:59:53+05:30 IST