ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Child Food: పిల్లల ఆహారం విషయంలో ఈ శ్రద్ధ తీసుకోకపోతే..!

ABN, First Publish Date - 2023-08-12T11:19:16+05:30

పదార్థాల్లో పోషక నష్టం జరగకుండా ఉండాలంటే వాటిని అతిగా వేయించడం, ఉడకబెట్టడం చేయకూడదు. కూరగాయలను ముక్కలుగా తరిగిన తర్వాత కడగకూడదు. మూత ఉంచి, చిన్న మంట మీద ఉడికిస్తే సమంగా ఉడకడంతో

పదార్థాల్లో పోషక నష్టం జరగకుండా ఉండాలంటే వాటిని అతిగా వేయించడం, ఉడకబెట్టడం చేయకూడదు. కూరగాయలను ముక్కలుగా తరిగిన తర్వాత కడగకూడదు. మూత ఉంచి, చిన్న మంట మీద ఉడికిస్తే సమంగా ఉడకడంతో పాటు పోషక నష్టం జరగకుండా ఉంటుంది. వేపుళ్లకు బదులుగా టమాటా వేసి మగ్గించిన కూరలను పిల్లలకు వండి పెట్టాలి. కారం కోసం ఎండు కారానికి బదులుగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడాలి. రుచి కోసం కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులను జోడించవచ్చు. కొంతమంది తల్లులు పిల్లలు ఇష్టంగా తింటారనే ఆశతో ప్రతి కూరలోనూ అల్లం, వెల్లుల్లి ముద్ద చేరుస్తూ ఉంటారు. లేదా లవంగాలు, దాల్చినచెక్క లాంటి గరం మసాలా దినుసులనూ చేరుస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూరగాయల సహజసిద్ధమైన రుచిని డామినేట్‌ చేస్తాయి. దాంతో పదార్థాల రుచి మారిపోతుంది. ఇలా వండిన వంటకాలన్నీ ఒకే విధంగా ఉండి, పిల్లలు అయిష్టత పెంచుకునే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి కూరగాయల సహజ రుచి చెక్కుచెదరని తీరులో వంటకాలు తయారుచేయాలి. అలాగే ఆకుకూరలు, పప్పు దినుసులు తప్పనిసరిగా పిల్లలు తినేలా చూసుకోవాలి. కొద్ది పరిమాణాల్లో నూనె అవసరం ఉండే వంటకాలకు నూనె బదులు నేరుగా నెయ్యి వాడడమూ ఆరోగ్యకరమే!

Updated Date - 2023-08-12T11:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising