ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coconut oil: నూనె రాసుకొని నిద్రపోతున్నారా? అయితే ఈ విషయం తెలియాల్సిందే!

ABN, First Publish Date - 2023-09-27T11:35:19+05:30

నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..

నూనె రాసుకొని- రాత్రంతా వదిలేస్తే ఏమవుతుంది? జుట్టు నిగనిగలాడిపోతుందా? నిగనిగలాడదు సరికదా సమస్యలు ఎదురవుతాయంటున్నారు సౌందర్యనిపుణులు. నూనె రాసుకొనే విషయంలో వారేమంటున్నారో చూద్దాం..

  • కొబ్బరి నూనె, ఆల్మండ్‌ నూనెలలో ఫ్యాటీ యాసిడ్స్‌, ట్రైగ్లిజరేట్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటి వాటితే జుట్టుకు మెరుపు వస్తుంది.

  • కొబ్బరినూనె వంటి వాటిలో విటమిన్‌ సి..ఈలు ఉంటాయి. ఇవి వాతావరణం వల్ల జుట్టుకు కలిగే ఇబ్బందులను సరిచేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

  • నూనెను తలకు రాసి మర్దనా చేయటం వల్ల తల పైభాగంలో రక్తప్రసరణ పెరుగుతుంది. రక్తప్రసరణ పెరగటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

నూనె రాసుకొని నిద్రపోతే..?

  • తలపై చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటి నుంచి జుట్టు పెరుగుతుంది. తలకు నూనె రాసుకొని ఎక్కువ సేపు వదిలేస్తే ఈ రంధ్రాలు పూడుకుపోతాయి. కొన్ని సార్లు చిన్న చిన్న పొక్కులు కూడా వస్తాయి. అందువల్ల నూనె రాసుకొన్న కొద్ది సేపటికే జుట్టును శుభ్రం చేసుకోవాలి.

  • నూనెను రాసుకొని ఎక్కువ సేపు వదిలేస్తే- సేబోర్హిక్‌ డెర్మేటిటిస్‌ అనే సమస్య ఏర్పడవచ్చు. దీని వల్ల తలపై చుండ్రు మాదిరిగా పచ్చటి రేణువులు వస్తాయి. కొందరికి తల మీదే కాకుండా కనుబొమ్మలు, చెవులలో కూడా ఈ రేణువులు ఏర్పడతాయి.

  • నూనె కారడం వల్ల ముఖంపై చర్మం బీటలు వారిపోతుంది. అందువల్ల జుట్టుకు నూనె రాసుకున్న 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2023-09-27T11:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising