ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dry Coconut: ఎండుకొబ్బరితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!

ABN, First Publish Date - 2023-11-21T12:57:47+05:30

మిగతా డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే, ఎండుకొబ్బరికి ప్రాధాన్యం తక్కువే! దీన్లోని పోషకాలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే

మిగతా డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే, ఎండుకొబ్బరికి ప్రాధాన్యం తక్కువే! దీన్లోని పోషకాలు, అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ప్రతి వంటకంలో దీన్ని వాడడం మొదలుపెడతాం!

మెదడు మహ బాగు: ఎండుకొబ్బరి వల్ల తెలివితేటలు పెరగకపోయినా, మెదడు పనితీరు మెరుగవుతుంది. ఎండుకొబ్బరిలోని పోషకాలు మెదడులో ‘మైలీన్‌’ అనే న్యూరోట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా మెదడులో సంకేతాల ప్రసార వేగం పెరుగుతుంది. ఫలితంగా మెదడు చురుకుదనం పెరుగుతుంది.

గుండె పదిలం: ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి, హెచ్‌డిఎల్‌ అనే మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు బలపడి, హృద్రోగాలు దరి చేరకుండా ఉంటాయి.

రక్తలేమి మాయం: రక్తలేమి వల్ల ఇన్‌ఫెక్షన్లు తేలికగా దాడి చేస్తాయి. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఆహారంలో ఐరన్‌ సరిపడా చేర్చుకోవాలి. ఎండుకొబ్బరిలో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వంటకాల్లో ఎండుకొబ్బరిని చేరుస్తూ ఉంటే, రోజుకు అవసరమైన ఐరన్‌ అందుతుంది. రక్తలేమి తొలుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-21T13:03:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising