Brain Health: ఈ ఐదు మూలికలతో జ్ఞాపకశక్తి మెరుగవుతుందిట..!
ABN, First Publish Date - 2023-01-10T13:19:31+05:30
మూలికలు శతాబ్దాలుగా సహజ నివారణలుగా ఉపయోగించబడుతున్నాయి.
జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలోనూ, మెదడును చురుగ్గా ఉంచడంలోనూ, పనితీరుతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు మూలికలు శతాబ్దాలుగా సహజ నివారణలుగా ఉపయోగించబడుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి తోడ్పడడంలో ప్రభావవంతంగా ఉన్న ఐదు మూలికలు ఏవంటే..
జింగో బిలోబా (Ginkgo Biloba): ఈ హెర్బ్ జింగో చెట్టు ఆకుల నుండి తీస్తారు. ఈ మూలిక సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది, ముఖ్యంగా పెద్దవారిలో. ఇది ఆందోళన, నిరాశ లక్షణాలతో కూడా సహాయపడుతుంది.
నీటిబ్రాహ్మీ (Bacopa monnieri): ఈ మూలిక భారతదేశానికి చెందినది. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతోంది. ఇది మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా జ్ఞాపకశక్తి, అభ్యాసం, మతిమరుపును మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఇది ఆందోళన, నిరాశతో ఉన్నవారికి సహకరిస్తుంది.
పానాక్స్ జిన్సెంగ్ (Panax Ginseng): "Real ginseng" అని కూడా పిలుస్తారు, ఈ మూలిక ఆసియాకు చెందినది. సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం, వాపును తగ్గించడం, జ్ఞాపకశక్తిని పెంచి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోజ్మేరీ (Rosemary): ఈ మూలికను సాధారణంగా వంటలో ఉపయోగిస్తారు, అయితే ఇది మెదడు శక్తిని పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం, వాపును తగ్గించడం ద్వారా జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఇది ఒత్తిడిని తగ్గించే ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది.
జీలకర్ర (Curcumin): ఇది పసుపులో కనిపించే సమ్మేళనం, భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా. ఇది మెదడులో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఇది యాంటి యాంగ్జయిటీ, యాంటీ డిప్రెసెంట్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటుంది.
Updated Date - 2023-01-10T13:19:35+05:30 IST