ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Food: పోషకాహారంతో క్షయ దూరం!

ABN, First Publish Date - 2023-08-10T11:17:39+05:30

క్షయరహిత సమాజం కోసం కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏటా దేశంలో కొత్త టీబీ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీబీ నివారణపై ఓ అధ్యయనం జరపగా.. ఔషధాలతో పాటు మంచి పోషకాహారాన్ని కూడా క్రమం తప్పకుండా అందిస్తే

ఔషధాలతో బలవర్ధక ఆహారమూ కావాల్సిందే...

లాన్సెట్‌ అధ్యయనంలో బహిర్గతం

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): క్షయరహిత సమాజం కోసం కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏటా దేశంలో కొత్త టీబీ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీబీ నివారణపై ఓ అధ్యయనం జరపగా.. ఔషధాలతో పాటు మంచి పోషకాహారాన్ని కూడా క్రమం తప్పకుండా అందిస్తే క్షయ నుంచి బయటపడొచ్చని తేలింది. ఆ వివరాలను లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌ బుధవారం ప్రచురించింది. జార్ఖండ్‌లోని 4 జిల్లాల పరిధిలో 28 టీబీ యూనిట్లలో 2,800 మంది టీబీ రోగులపై అంతర్జాతీయ పరిశోధనా బృందం ఈ అధ్యయనం చేసింది. ఈ బృందంలో కెనడాకు చెందిన మెక్‌గిల్‌ యూనివర్సిటీ, చెన్నై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ టీబీ, బెంగళూర్‌ నేషనల్‌ టీబీ ఇన్‌స్టిట్యూట్‌, రాంచీ స్టేట్‌ టీబీ సెల్‌తో పాటు జాతీయ క్షయ నివారణ కార్యక్రమం అధికారులున్నారు. జాతీయ క్షయ నివారణ కార్యక్రమంలో క్షయ బాధితులనే ఈ బృందం తమ పరిశోధనకు ఎంచుకుంది. అధ్యయనంలో భాగంగా 2,800 రోగులకు మందికి ప్రతీనెలా 10 కిలోల ఫుడ్‌ బాస్కెట్‌ అందించారు. ఆ బాస్కెట్‌లో బియ్యం, పప్పులు, మిల్క్‌ పౌడర్‌, ఆయిల్‌, మల్టీ విటమిన్స్‌ ఉంచారు. అలా 6 నెలల పాటు వారికి క్రమం తప్పకుండా ఇచ్చి అవి వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత వారందరికీ టీబీ పరీక్షలు చేశారు. గత నెల 31 వరకు ఆ రోగులందర్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు. వారంతా క్షయ నుంచి బయటపడినట్లుగా గుర్తించారు.

దీంతో బలవర్ధకమైన ఆహారం ఇవ్వడం ద్వారా వారిలో క్షయ వ్యాప్తిని దూరం చేసినట్లు తేల్చారు. ఊపిరితిత్తులా క్షయ, అంటులా వ్యాప్తి చెందే టీబీనీ 40-50 శాతం మేరకు దూరం చేసినట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని రేషన్‌ ట్రైల్స్‌గా తన అధ్యయనంలో పేర్కొంది. ఇక మొత్తం రోగుల్లో సగం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడతున్నారని, వారికి పోషకాహారం అవసరమని గుర్తించింది. అలాగే పోషకాహారం తీసుకున్న 2 నెలల్లోనే కొంతమంది బరువు పెరిగారు. ఇంకా వారిలో చనిపోయే ప్రమాదం 60 శాతం మేర తగ్గింది. బాగా వెనుకబడిన ప్రాంతాలతో పాటు అణగారిన వర్గాల్లోనే ఇటువంటి సమస్య అధికంగా ఉన్నట్లు పరిశోధకులు తేల్చారు. ‘‘క్షయ చికిత్సలో ఔషధాలతోపాటు ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరణాల రేటును తగ్గిస్తుంది’’ అని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్‌ అనురాగ్‌ భార్గవ్‌ వ్యాఖ్యానించారు. పోషకాహారం తీసుకున్న తర్వాత వారిలో 35-50 మందిలో మరణాల రేటు తగ్గిందన్నారు. తీవ్రమైన పోషకాహార లోపం వల్ల టీబీ రోగుల్లో మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. 2021 గణాంకాల మేరకు దేశంలో 30 లక్షల మంది క్షయ బాధితులున్నారని, 4,94,000 మంది టీబీతో మరణించారని ఆ అధ్యయనం తెలిపింది. 2015 నుంచి టీబీ మరణాలు బాగా తగ్గాయని, కొవిడ్‌ తర్వాత మళ్లీ పెరిగాయని తెలిపింది.

Updated Date - 2023-08-10T11:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising