ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kids care Cough: పిల్లలకు దగ్గు మందు వాడుతున్నారా? అయితే ఈ హెచ్చరికలు గుర్తించుకోండి!

ABN, First Publish Date - 2023-05-30T12:00:53+05:30

పిల్లల్లో దగ్గు మొదలైన వెంటనే దగ్గు మందు వాడకం మొదలు పెట్టేస్తూ ఉంటాం. అయితే మత్తును కలిగించే యాంటీహిస్టమిన్లను రెండేళ్ల కంటే తక్కువ వయసున్న

Kids care Cough
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లల్లో దగ్గు మొదలైన వెంటనే దగ్గు మందు వాడకం మొదలు పెట్టేస్తూ ఉంటాం. అయితే మత్తును కలిగించే యాంటీహిస్టమిన్లను రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వకూడదనే హెచ్చరికలను ఈ మందుల మీద ముద్రించడం మొదలుపెట్టారు. ఆస్ట్రేలియాలో ఆరేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు వాడే దగ్గు మందుల మీద నిషేధం విధించారు. ఎందుకంటే...

దగ్గుమందుల్లోని క్రియాశీల పదార్థాలు అవి పేర్కొనే ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సిరప్స్‌లో శరీరం దగ్గును ప్రేరేపించే రిఫ్లక్స్‌ను అణచివేసే సప్రెసెంట్స్‌తో పాటు, కఫాన్ని కరిగించే ఎక్స్‌పెక్టొరెంట్స్‌, మ్యూకోలైటిక్స్‌ ఉంటాయి. ఇంకొన్ని జలుబు, దగ్గు మందుల్లో ముక్కు దిబ్బెడను వదిలించే డికంజెస్టెంట్స్‌, తుమ్ములు, ముక్కు కారడాన్ని నిరోధించి, నిద్రకు దోహదపడే మత్తునిచ్చే యాంటీ హిస్టమిన్లు ఉంటాయి. అయితే అవసరాన్ని బట్టి ఈ దగ్గు మందులను పిల్లలకు వాడుకోవడంలో తప్పు లేదని ఎంతోమంది తల్లితండ్రులు భావిస్తూ ఉంటారు. కానీ ఈ మందులు, యాంటీబయాటిక్స్‌ వాడడానికి బదులుగా పిల్లలకు విశ్రాంతినీ, భరోసాను కల్పించడం మేలంటున్నారు వైద్యులు. అక్యూట్‌ బ్యాక్టీరియల్‌ న్యుమోనియా లేదా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల తీవ్రమైన దగ్గు, బ్యాక్టీరియల్‌ బ్రాంఖైటిస్‌, కోరింత దగ్గు లాంటి రుగ్మతలు ఉంటే తప్ప పిల్లలకు యాంటీబయాటిక్స్‌ వాడకూడదు. ఆ మందులు కూడా వైద్యులు సూచించినవే అయి ఉండాలి. ఒకవేళ జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే పారాసెటమాల్‌ వాడుకోవచ్చు. అయితే మాత్ర వేసే ముందు పిల్లల బరువు, వయసుకు తగిన మోతాదు కోసం ప్యాకేజీని పరిశీలించాలి. పిల్లలకు 12 నెలల వయసు దాటితే, కఫంతో కూడిన దగ్గు తగ్గడం కోసం తేనెను అందించవచ్చు. తేనె కఫం ఉత్పత్తిని తగ్గిస్తుంది.

Updated Date - 2023-05-30T12:00:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising