ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hair tips: పెరుగుతో జుట్టు రాలకుండా చేయొచ్చు..! అదెలా అంటే..!

ABN, First Publish Date - 2023-05-03T11:04:01+05:30

పెరుగు తింటే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది. అయితే ఈ పెరుగుతో జుట్టు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. జుట్టు రాలటం, చుండ్రులాంటి సమస్యలను దూరం

Hair tip
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరుగు తింటే చలువదనం. పైగా బాగా నిద్రపడుతుంది. అయితే ఈ పెరుగుతో జుట్టు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు. జుట్టు రాలటం, చుండ్రులాంటి సమస్యలను దూరం చేయవచ్చు. పెరుగుతో చేసుకునే హెయిర్‌ మాస్కులేంటో తెల్సుకుందాం.

  • కప్పు పెరుగు తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నిమ్మరసంతో పాటు నాలుగైదు చుక్కల కొబ్బరినూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్లకు పట్టేట్లు పట్టించాలి. ఇరవై నిముషాల పాటు ఆరబెట్టి కడిగేయాలి. దీని వల్ల జుట్టు వత్తుగా పెరగటంతో పాటు చుండ్రు సమస్య తగ్గిపోతుం

  • కప్పు పెరుగులో కోడిగుడ్డు సొన వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించాలి. అరగంట పాటు అలానే వదిలేశాక.. చన్నీళ్లతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టులో మెరుపు వస్తుంది, ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

  • కప్పు పెరుగులోకి బాగా పండిన అరటిపండును కట్‌ చేసి వేసిన తర్వాత మిశ్రమాన్ని మెత్తగా కలపాలి. దీనికి నాలుగైదు చుక్కల ఆలివ్‌ నూనెను జతచేయాలి. జుట్టుకు పట్టించి వైడ్‌ టూత్‌ దువ్వెనతో దువ్వుకోవాలి. ఈ మిశ్రమం జుట్టుకు పట్టేంత వరకూ ఆరబెట్టుకోవాలి. కనీసం అరగంట అలా ఉంచుకోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు ఊడిపోయే సమస్య ఉండదు. మరింత గట్టిగా కుదుళ్లు ఉంటాయి.

  • కప్పు పెరుగుతోకి టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి. దీనికి కొద్దిగా యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత జుట్టుకు పట్టించి షాంపూతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల జుట్టు గట్టిగా ఉంటుంది.

  • కప్పు పెరుగులోకి రెండు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌ను వేయాలి. మిశ్రమంగా కలిపిన తర్వాత ఆ పేస్ట్‌ను జుట్టు కుదుళ్లు తగిలేవరకూ పట్టిస్తే ఇచ్చింగ్‌ సమస్యరాదు. దీనికి తోడు జుట్టు పెరుగుతుంది.

Updated Date - 2023-05-03T11:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising