Custard Apple: సీతాఫలంతో ఎన్ని లాభాలో..!
ABN, First Publish Date - 2023-11-22T11:28:19+05:30
కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ సీతాఫలం పండును ఇష్టపడని వారుండరు. మాగిన సీతాఫలం తింటే ఇట్టే కడుపు నిండుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీతాఫలం సంగతులివే...
కొండ ప్రాంతాల్లో పెరిగే ఈ సీతాఫలం పండును ఇష్టపడని వారుండరు. మాగిన సీతాఫలం తింటే ఇట్టే కడుపు నిండుతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సీతాఫలం సంగతులివే...
సీతాఫలం పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీని వల్ల సులువుగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అందుకే చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఈ పండును తినటానికి ఇష్టపడతారు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ముఖ్యంగా ఈ పండు తినటం వల్ల ఇందులోని విటమిన్-ఎ దక్కుతుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం కలుగుతుంది.
మెదడు ఆరోగ్యానికి మంచిది.
ఇందులోని బి6 విటమిన్ వల్ల మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. డిప్రషన్, ఒత్తిడి దరిచేరే అవకాశాలు తక్కువ.
పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటు సమస్య ఉండదు. దీనివల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
చర్మ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగడే లక్షణాలు ఈ పండులో ఉన్నాయి.
ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.
వందగ్రాముల సీతాఫలంలో 94 కేలరీలుంటాయి. అందుకే ఈ పవర్ ఫుడ్ తింటే బరువు పెరిగే అవకాశాలెక్కువ.
నీరసంగా ఉన్నప్పుడు.. ఈ పండు తినటం వల్ల తక్షణమే శక్తి వస్తుంది.
కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు. కీళ్లనొప్పులు దరిచేరవు.
రుచితో పాటు పోషకాల్లోనూ మేటి అయిన ఈ పండును తింటే డయాబెటిస్ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉండదు.
కడుపులోని అసిడిటీ తగ్గిపోతుంది. సీతాఫండ్లే కాదు ఆకుల పసరును తాగితే సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
సీతాఫలం ఆకుల గుజ్జును గాయాలకు పట్టిస్తే త్వరగా మానిపోతాయి.
వ్యాధినిరోధక శక్తిని పెంచే అద్భుతమైన పండు సీతాఫలం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2023-11-22T11:54:58+05:30 IST