Psychology: ఇలా చేస్తే భావోద్వేగాలు అదుపులో...!
ABN, First Publish Date - 2023-04-04T13:17:58+05:30
చంచల ఆలోచనలు, కుదేలు చేసే భావోద్వేగాలు, కుంగదీసే ఒత్తిడిలు... మనసుతో పాటు, శరీరాన్నీ అతలాకుతలం చేస్తాయి. వీటి మూలాల ఆధారంగా, సమస్యను చక్కదిద్దే విధానాలను, నియమాలను అనుసరించాలి!
చంచల ఆలోచనలు, కుదేలు చేసే భావోద్వేగాలు (Psychology), కుంగదీసే ఒత్తిడిలు... మనసుతో పాటు, శరీరాన్నీ అతలాకుతలం చేస్తాయి. వీటి మూలాల ఆధారంగా, సమస్యను చక్కదిద్దే విధానాలను, నియమాలను అనుసరించాలి!
వెన్నుకు పోషకాలు అందించే మెదడు నుంచి వెన్నుపాములోకి స్రవించే స్పైనల్ ద్రవాన్ని తర్పక కఫం నియంత్రిస్తుంది. దీన్నే లింఫాటిక్ ద్రవం అంటారు. ఈ ద్రవం కేంద్ర నాడీ వ్యవస్థకు పోషకాలను అందిస్తూ, మెదడు నుంచి విసర్జకాలను, విషాలను వెలుపలికి రప్పించి, వెన్నుపూసల్లో ఆఖరిదైన తోక ఎముక ద్వారా లింఫ్ మార్గాల్లోకి పంపిస్తుంది. మెదడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈ లింఫ్ మార్గాలు తెరవబడి ప్రమాదకరమైన నాడీసంబంధ విషాలు సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్‌లోకి వెళ్తాయి. ఒక ఏడాది కాలంలో ఇలా సుమారు మూడున్నర కిలోల విషాలు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు మెదడు నుంచి విసర్జింపబడుతూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియ మొత్తానికి మెదడుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర (sleep) అవసరం అవుతుంది.
నాశిక ద్వారా...
ప్రాచీన ఆయుర్వేద చికిత్సా విధానం ‘నశ్యం’ ద్వారా మూలికలతో తయారైన నూనెలను ముక్కులోకి పీల్చవలసి ఉంటుంది. ఈ విధానం మెదడులోని లింఫాటిక్ ద్రవాలైన ‘రసాలను’, పుర్రెలోని ఖాళీ ప్రదేశాలను (సైనస్) శుభ్రపడతాయి. మెదడులోని స్రావాలు మెడలోని లింఫాటిక్ నాళాలు, ముక్కుతో సంబంధం ఉన్న సైన్‌సల ద్వారా విసర్జింపబడుతూ ఉంటాయి. కాబట్టి నశ్య చికిత్సతో ఈ ద్రవాలు బయటకు వెళ్లిపోయి మెదడు మీద ఒత్తిడి తొలగి మానసిక ప్రశాంతత, భావోద్వేగాలు నెమ్మదించి, కంటి నిండా నిద్ర పడుతుంది. మెదడు నుంచి స్రావాలను విసర్జించే ‘గ్లింఫాటిక్ వ్యవస్థ’ ఒక పక్కకు తిరిగి నిద్రపోతే మెరుగ్గా జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఒక పక్కకు ఒత్తిగిలి పడుకునే అలవాటు చేసుకోవాలి. పెందలకడనే పడుకుని, పెందలకడనే నిద్ర లేవడం అనేది పాతకాలపు అలవాటే అయినా, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనం ఉంది. త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేచేవారిని అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారితో పోల్చినప్పుడు శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్ నియంత్రణ నియమిత నిద్రవేళలు పాటించే వారిలో నియంత్రణలో ఉన్నట్టు అధ్యయనాల్లో రుజువైంది.
ప్రాణాయామం ద్వారా శుద్ధి!
దీర్ఘ శ్వాస ప్రక్రియ ద్వారా మెదడు నుంచి విసర్జక ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. ఆవిరి పీల్చడం ద్వారా కూడా సెరెబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ మెదడు నుంచి బయటకు త్వరితంగా వెళ్తుందని అధ్యయనాల్లో రుజువైంది. ఫైట్ ఆర్ ఫ్లయిట్ సంబంధ ఒత్తిడి (ప్రమాదం ఎదురైనప్పుడు దాంతో పోరాడే లేదా పలాయనం చిత్తగించే చర్యకు తోడ్పడే హార్మోన్ల వేగమైన విడుదల) మెదడు ద్రవాల విసర్జనను ప్రభావితం చేస్తుంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగాభ్యాసాలు గ్లింఫాటిక్ వ్యవస్థకు తోడ్పడతాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
కపాలభాతి, ప్రాణాయామం
‘కపాలభాతి’ ప్రత్యేకంగా తర్పక కఫ శుద్ధి గురించే తయారైనది. కపాలం అంటే ‘పుర్రె’, భాతి అంటే ‘ప్రకాశవంతం’ అని అర్థం. కపాలభాతిలో పొత్తికడుపు నుంచి ఊపిరి పుర్రెకు నేరుగా చేరి, మెదడు నుంచి విసర్జకాల విసర్జనకు తోడ్పడేలా ఈ విధానం రూపొందించబడింది. కపాలభాతి సాధనతో మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ నుంచి విసర్జకాలు తేలికగా వెలుపలికి వెళ్లగొట్టబడటం వల్ల ఒత్తిడి అదుపులో ఉంటుంది.
బ్రహ్మరి ప్రాణాయామం
నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా గాలి పీల్చుకునేవారి శరీరంలో ఎక్కువ మొత్తంలో ‘నైట్రిక్ ఆక్సైడ్’ ఉంటుంది. కాబట్టే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడంతో కూడిన ప్రాణాయామం లాంటి పలు వ్యాయామాల్లో ఉంటాయి. కూనిరాగాలు తీయడం (హమ్మింగ్) ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి కేవలం ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం ద్వారా జరిగే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి 15 రెట్లు ఉంటుంది. అలాగే కూనిరాగాలు తీసే సమయంలో కదులుతూ ఉండడం ద్వారా మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది. మెదడులో కరగకుండా మొండికేసిన ద్రవాలు ఈ విధానం ద్వారా కదిలి, కరిగి వెలుపలికి విసర్జింపబడతాయి. నోటి ద్వారా శ్వాస పీల్చుకునే అలవాటు వల్ల ఫైట్ అండ్ ఫ్లయిట్ తీరు పెరిగి, నాడీ వ్యవస్థపై ప్రభావం పడడంతో, సెరబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ వెలుపలికి వచ్చే ప్రక్రియ కుంటుపడుతుంది. అదే ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడి గ్లింఫాటిక్ వ్యవస్థ పనిచేస్తుంది.
Updated Date - 2023-04-04T13:17:58+05:30 IST