ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

donkey milk: ఈ పాలు మహాశ్రేష్ఠం! ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో..!

ABN, First Publish Date - 2023-06-02T11:55:03+05:30

ఒరేయ్‌ గాడిద.. గాడిద గుడ్డేమో కదా.. గాడిద బరువు మోస్తున్నాడు.. ఇలా అనేక రకాలుగా గాడిదను కించపరుస్తూ నిత్యం పిల్లలను, ఎదుటివారిని తిడుతూ ఉంటారు. కానీ..

Donkey milk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లీటరు రూ.10 వేలు

గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్‌

పోషకాలు, ఖనిజాలు, విటమిన్‌లు పుష్కలం

ఒరేయ్‌ గాడిద.. గాడిద గుడ్డేమో కదా.. గాడిద బరువు మోస్తున్నాడు.. ఇలా అనేక రకాలుగా గాడిదను కించపరుస్తూ నిత్యం పిల్లలను, ఎదుటివారిని తిడుతూ ఉంటారు. కానీ.. ఆ గాడిద ఇచ్చే పాలలో ఎన్నో పోషకాలతోపాటు, ఖనిజాలు, విటమిన్‌లు లభించడంతో నేడు గాడిద పాలకు ఎంతో డిమాండ్‌ ఉంది. ఈపాలు లీటరు రూ.పదివేలు అంటే దీనిని బట్టే తెలుస్తుంది గాడిద పాలకు ఎంత డిమాండ్‌ ఉందో.. గంగి గోవుపాలు గరిటడైనను చాలు.. కడివె డైననేమి ఖరము(గాడిద) పాలు అని చిన్నపుడు చదుకొన్న పద్యం గుర్తువస్తుంది. కానీ ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్‌ ఉంది. ఎంత డిమాండ్‌ అంటే గాడిదపాలలో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో విశేషగుణాలు ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన వైరల్‌ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారం. గాడిద పాలలో ఔషధాలే కాకుండాబ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు. కేరళలో, మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో గాడిదలను విరివిగా పెంచుతూ పలువురు ఉపాధిపొందుతున్నారు. వీటిపై ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని చెపుతున్నారు. గాడిదపాల వల్ల ఉపయోగాల గురించి నిర్వహించిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈపాలకు మంచి డిమాండ్‌ వచ్చింది. గాడిదపాలు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్‌ఫెక్షన్‌, టీబీ తదితర వ్యాధుల నివారణలో బాగా పనిచేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందంటున్నారు.

ఏడాదికి రూ.20 లక్షల సంపాదన

కేరళలో ఓ మహిళ గాడిదపాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదిస్తోంది. గాడిదపాలతో చేసిన సౌందర్య ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. పాలతో సబ్బులు, లిప్‌బామ్‌లు, బాడీలోషన్‌లు తయారుచేస్తున్నారు. చిన్న పిల్లలకు గాడిదపాలు చాలా బలాన్నిస్తాయి. ఒక్కో గాడిద రోజుకు 200 నుంచి 250 మిల్లీ లీటర్ల పాలను ఇస్తుందట.

ఔషధగుణాల గని..

ఇది ఇచ్చేపాలలో మంచి ఔషధగుణాలు ఉన్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకు వస్తాయి. ఆవు, మేక, గొర్రె, గేదె, ఒంటె లాంటి ఇతర పాడిజాతుల పాలతో పోలిస్తే గాడిదపాలు తల్లి పాలకు చాలా దగ్గరగా ఉంటాయట. ఆర్దరైటీస్‌, దగ్గు, జలుబు లాంటి ఇన్‌ఫెక్షన్‌లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. వీటిలో ఉండే యాంటి మైక్రోబయాల్‌ లక్షణాలు అంటువ్యాధులు, బాక్టీరియా ఇతర వైర్‌సల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అలెర్జీని దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గాడిద పాలతో ఉపయోగాలు

  • గాడిద పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు, విటమిన్‌-బీ ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోజ్‌ రూపంలో ఉంటాయి.

  • యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు, అంటు వ్యాధులు, బ్యాక్టీరియా ఇతరవైర్‌సల నుంచి దూరం చేసేందుకు సహాయ పడతాయి.

  • అలర్జీని దూరం చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

  • ఆర్దరైటీస్‌, దగ్గు, జలుబు లాంటి ఇన్‌ఫెక్షన్‌లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలను ఉపయోగిస్తారు.

  • ఆవుపాలతో పోలిస్తే గాడిద పాలల్లో 5 రెట్లు తక్కువ కెసిన్‌, సమాన స్ధాయిలో ప్రోటీన్‌లు కలిగి ఉంటాయి. అందుకే వీటిని తాగడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌స్‌ ఉండవు.

  • గాడిద పాలల్లో ముఖ్యమైనవి లాక్టోజ్‌. ఇది శరీరంలోని కాల్షియంను గ్రహించడానికి సహాయ పడి, ఎముకలను బలంగా మారుస్తాయి.

  • ఈ పాలలో ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజ పరిచే ప్రోటీన్‌, సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యం కలిగి ఉంటాయి.

  • గాడిద పాలు కణాలను నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తి చేయడానికి కారణం అవుతాయి.

  • రక్త నాళాలను విడదీసి నైట్రిక్‌ఆక్సైడ్‌ రక్త నాళాలకు అందించి రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది.

  • వీటితో సౌందర్య ఉత్పత్తులైన స్కిన్‌ క్రీమ్‌లు, ఫేస్‌ మాస్కులు, సబ్బులు, షాంపుల తయారీలో వాడతారు.

  • మనకు మేలు చేసే ఔషధాలను తయారు చేస్తారు. దీనిలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది.

  • దీర్ఘాయాషునిచ్చే వీటిలో పెద్ద మొత్తంలో బి, బి-12 విటమిన్‌లతో పాటు న్యూట్రీన్‌లు ఉంటాయి.

    • రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్‌ఫెక్షన్‌, టీబీ, వ్యాధుల నివారణకు ఉపయోగపడుతాయి.

గాడిద పాలపైనే జీవానాధారం

ఎన్నో సంవత్సరాలుగా తమ కుటుంబం గాడిదల పెంపకంపైనే ఆధారపడి బతుకుతున్నాం. తాము పది గాడిద లను పెంచుకుంటూ కాలనీలో, బస్తీలో ఇంటింటికీ తిరిగి పాలు విక్రయిస్తాం. ఇంజక్షన్‌ బుడ్డీపాలు రూ.100 నుంచి 150 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. పాలల్లో ఎటు వంటి కల్తీలేకుండా కొనుగోలుదారుల ఇళ్లకెళ్లి వారి ముందే పాలు పితికి స్వచ్ఛమైన పాలను అందిస్తున్నాం. కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, సూరారం పలు ప్రాంతాల్లో పాల విక్రయాలు చేస్తాం. ఈ పాలు తాగడం వల్ల చిన్నపిల్లలకు ఎంతో ఉపయోగం ఉండడంతో జనం పోటీ పడి కొంటున్నారు. అయితే లీటరు, అర లీటరు పాలు కాదు.. 10 ఎంఎల్‌, 20 ఎంఎల్‌ మోతాదులో కొనుగోలు చేస్తున్నారు. కారణం పాల ధర ఎక్కువగా ఉండడంతో సరిపడ పాలను మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.

- చంద్రమ్మ, మెట్కానిగూడ

-హైదరాబాద్, షాపూర్‌నగర్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-06-02T11:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising