Healthy food: వానాకాలంలో రోగాలు దరిచేరకుండా ఉండాలంటే..!
ABN, First Publish Date - 2023-07-20T11:26:29+05:30
వానలొచ్చాయంటే వాతావరణంలో చల్లదనమే కాదు.. ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. జీర్ణసమస్యలు, దగ్గు, జలుబు ఈ సీజన్లో సులువుగా వస్తాయి. వానాకాలాన్ని ఎంజాయ్ చేయటమే కాదు.. హెల్తీ డైట్ కూడా అవసరం.
వానలొచ్చాయంటే వాతావరణంలో చల్లదనమే కాదు.. ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. జీర్ణసమస్యలు, దగ్గు, జలుబు ఈ సీజన్లో సులువుగా వస్తాయి. వానాకాలాన్ని ఎంజాయ్ చేయటమే కాదు.. హెల్తీ డైట్ కూడా అవసరం.
ప్రొటీన్లు అధికంగా ఉండే నానబెట్టిన గింజల్ని తినాలి. బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్ సమయంలో వీటిని తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ కాలంలో పసుపు గొప్ప ఔషధం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండే ఈ పసుపు వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అందుకే గోరువెచ్చని నీళ్లలోనో, పాలల్లోనో మంచి పసుపు కలిపి నిద్రపోయే ముందు తాగితే చక్కని ఫలితం ఉంటుంది.
విటమిన్-సి ఎక్కువగా ఉండే నిమ్మరసం తీసుకోవటం మంచిదే. సాధారణంగా ఎండాకాలం నిమ్మరసాన్ని తాగుతారు. అలాగే మాన్‌సూన్‌లోనూ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఇది ఉపకరిస్తుంది.
బాదం, పిస్తా, జీడిపప్పు లాంటి బలవర్ధకమైన నట్స్‌ను ఈ కాలంలో తినాలి. సులువుగా జీర్ణం అవ్వటంతో పాటు బలాన్ని, ఇమ్యూనిటీ పవర్‌ను ఇస్తాయవి.
ఈ కాలంలో చిరుతిండ్లకు బంద్ చెప్పటం మంచిదే. వెజిటేబుల్ సూప్, చికెన్ సూప్‌లాంటివి తాగటం వల్ల ఉపశమనంతో పాటు ఆరోగ్యానికీ మంచిదే.
హెర్బల్టీని ప్రిఫర్ చేయటం ఈ కాలంలో మరీ మంచిది.
తాజా కూరగాయలతో పాటు తాజా పండ్లను తినాలి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు రావు.
మెంతిపప్పు, మెంతికూర తింటే శరీరానికి బూస్టర్‌లా పని చేస్తుంది.
కోడిగుడ్డుతో పాటు ఒమేగా ఫాటీ యాసిడ్స్ ఉండే చేపలను తినటం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
అల్లంటీ, వెల్లుల్లి వేసిన ఆహారం తినటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, కడుపులో సమస్యలు పోతాయి.
అతిగా మసాలా ఉండే పదార్థాలు, ఎక్కువగా నాన్‌వెజ్ తినటం లాంటి ఈ కాలంలో మంచిది కాదు. దప్పిక తక్కువ ఉన్నా మంచి నీళ్లను బాగా తాగాలి. గోరువెచ్చని నీళ్లను తాగితే మరీ మంచిది.
Updated Date - 2023-07-20T11:26:29+05:30 IST