ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

FOOD: స్నాక్‌గా ఇవి తింటే మాత్రం..!

ABN, First Publish Date - 2023-05-30T12:14:34+05:30

పేరేదైనా ఇవి అందించే పోషకాలు మాత్రం వెల కట్టలేనివే! విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతోపాటు వీటిలో ఔషధగుణాలూ ఉంటాయి. కాబట్టి

FOOD
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఖ్‌నా, ఫాక్స్‌ నట్‌, లోటస్‌ సీడ్‌... తామర విత్తనాలకు రకరకాల పేర్లు. పేరేదైనా ఇవి అందించే పోషకాలు మాత్రం వెల కట్టలేనివే! విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతోపాటు వీటిలో ఔషధగుణాలూ ఉంటాయి. కాబట్టి వీటితో పాప్‌కార్న్‌ తయారు చేసుకుని స్నాక్‌గా తింటూ ఉండాలి.

• వీటిలో క్యాలరీలు, కొవ్వు, సోడియం తక్కువ. కాబట్టి భోజనానికీ, భోజనానికీ మధ్యలో తినొచ్చు.

• పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ. కాబట్టి రక్తపోటు ఉన్నవాళ్లు తింటే బిపి అదుపులోకొస్తుంది.

• వీటిలో చక్కెర చాలా తక్కువ. కాబట్టి తరచుగా ఆకలితో బాధపడే మధుమేహులకు ఇది చక్కని శ్నాక్‌.

• వీటిలో పీచు ఎక్కువ కాబట్టి మలబద్ధకం ఉన్నవాళ్లు తప్పక తినాలి.

• వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే! వృద్ధాప్య లక్షణాలు దూరం చేయాలనుకుంటే వీటిని తరచుగా తింటూ ఉండాలి.

• పునరుత్పత్తి సమార్ధ్యాన్ని పెంచే గుణం ఈ విత్తనాలకుంటుంది. కాబట్టి అండాలు విడుదలవని మహిళలు, వీర్యం నాణ్యత తక్కువగా ఉన్న పురుషులు ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.

• ఫాక్స్‌ నట్స్‌ నిద్రలేమినీ పోగొడతాయి.

• కాఫీ అడిక్షన్‌ పోగొట్టుకోవాలని అనుకుంటే, కాఫీ తాగాలనిపించినప్పుడంతా వీటినే తింటూ ఉండాలి.

Updated Date - 2023-05-30T12:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising