EYE: కండ్ల కలకతో తస్మాత్ జాగ్రత్త..! బారిన పడకుండా ఉండాలంటే..!
ABN, First Publish Date - 2023-07-31T12:49:45+05:30
ఎడతెరిపి లేని వర్షాలు... మబ్బులు పట్టిన వాతావరణం చాలా మందికి ఆహ్లాదాన్ని పంచుతోంది. మరోవైపు సీజనల్ వ్యాధులను వ్యాపింప చేస్తుంది. ఇటీవల చాలా మంది ఓ వ్యాధి బారిన అధికంగా పడుతున్నారు. ఎర్రగా మారన కళ్లతో ఆస్పత్రులకు చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణమే.
ఎడతెరిపి లేని వర్షాలు... మబ్బులు పట్టిన వాతావరణం చాలా మందికి ఆహ్లాదాన్ని పంచుతోంది. మరోవైపు సీజనల్ వ్యాధులను వ్యాపింప చేస్తుంది. ఇటీవల చాలా మంది ఓ వ్యాధి బారిన అధికంగా పడుతున్నారు. ఎర్రగా మారన కళ్లతో ఆస్పత్రులకు చేరుతున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణమే. అధిక తేమతో కూడిన వాతావరణంలో కళ్లు ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నాయి. దీనిని వైద్య పరిభాషలో కండ్ల కలక అని పిలుస్తారు. ఇది ప్రతి ఏడాది వర్షాకాలంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధుల తర్వాత అధిక వ్యాప్తి చెందే వ్యాధి. సాధారణంగా వ్యక్తుల ముక్కు సైన్‌సలలో నివసించే బాక్టీరియా కారణంగా ఈ కండ్ల కలక వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ అధికంగా ఉంటంతో బ్యాక్టీరియా, వైర్‌సలకు వాహకంగా పనిచేస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా ప్రయాణించడానికి ఉపకరిస్తుంది. ఇది సోకినప్పుడు కళ్లచుట్టూ ఎరుపు, నీరు, దురద, నొప్పి, వాపు వంటివి సాధారణంగా కనిపిస్తాయి. కండ్ల కలక ఉన్న చాలా మంది రోగులు దగ్గు, జ్వరంతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మరోరకమైన కండ్ల కలక కూడా ఉంది. ఇది పుప్పొడి, సిగరేట్ పొగ, పూల్ క్లోరిన్, కారు పొగలు, వాతావరణంలో మరేదైనా ప్రతి చర్య కారణంగా అలెర్జీ వచ్చి కండ్ల కలక రావొచ్చు. ఇది అంటు వ్యాధి కాదు. ఈ తరహా కండ్ల కలక కూడా పై చెప్పిన లక్షణాలను చూపిస్తుంది. మీ కళ్లు దురదగా, ఎర్రగా, నీరు ఎక్కువ కారుతూ కనిపిస్తుంది. అయితే ఇది మరొకరికి వ్యాపించదు. మీరు ఒకవేళ బ్యాక్టీరియా వైరస్ వల్ల కండ్ల కలక వస్తే మీరు జాగ్రత్త పడాలి. మీ నుంచి మరొకరికి వ్యాప్తించే అవకాశం ఉంది. కాబట్టి వేరే వ్యక్తులకు దూరంగా ఉండాలి.
హైదరాబాద్, గచ్చిబౌలి, జూలై 30 (ఆంధ్రజ్యోతి)
Updated Date - 2023-07-31T12:49:50+05:30 IST