ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rains: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించండి!

ABN, First Publish Date - 2023-06-28T14:42:37+05:30

వాతావరణం చల్లబడినపుడు దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమ తెరలు వాడటం చేయాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే దోమలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

• వాతావరణం చల్లబడినపుడు దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమ తెరలు వాడటం చేయాలి. దోమలు పెరగకుండా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇల్లంతా తడిగా ఉంటే దోమలు వస్తాయని గుర్తుంచుకోండి. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే కాస్త గోరు వెచ్చని నీళ్లను తాగితే మంచిది.

• మొలకెత్తిన గింజలు, నారింజ, తాజా కూరగాయలు, పండ్లు తినాలి. దీనివల్ల సివిటమిన్‌ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

• ఇంట్లో ఆహారానికి కాస్త గాలి తగిలేట్లు ఉంచండి. బయట బురద దగ్గర ఉండే షాపుల్లో ఆహారపదార్థాలు, జంక్‌ ఫుడ్‌ తినటం మానేయాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి.

• ఇంట్లో బట్టలు ఒకే చోట వేయడం, తడిచిన బట్టలు కుప్పగా వేయటం వల్ల దోమల సమస్యతో పాటు బ్యాక్టీరియా సమస్య ఉత్పన్నమవుతుంది.

• పాల ఉత్పత్తులైన వెన్న, నెయ్యికి దూరంగా ఉండటం మంచిది. అయితే తాజా పెరుగును తింటే మంచిది. ఇక కారం ఉండే ఆహారాన్ని తినకూడదు. సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్నే తినాలి.

• వాతావరణం చల్లబడినపుడు వర్కవుట్స్‌ చేయటం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఇక హెర్బల్‌ టీ లాంటివి తాగటానికి ఆసక్తి చూపితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

• చేతుల్ని శుభ్రంగా కడిగి తినాలి. బయటకు వెళ్లేప్పుడు గొడుగులు, రెయిన్‌కోట్లు తీసుకెళ్లటం మంచిది.

• తడి బట్టలు, తడి షూస్‌, తడి తువాళ్లు వాడకపోవటమే మంచిది. ఎల్లప్పుడు పొడిగా ఉండే బట్టలను ఉపయోగించాలి.

• డస్ట్‌ జోలికి వెళ్లటం లాంటి పనులు చేయకూడదు. ఇతరులెవరైనా జ్వరాల బారిన పడితే దూరంగా ఉండటం మంచిది. లేకుంటే మీకూ ఆ సమస్య వస్తుంది.

• ఇంట్లో సింక్‌తో పాటు వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త ఉండకుండా చూసుకోవాలి.

• వానలు పడినప్పుడు ఇంట్లో కరెంటు కనెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Updated Date - 2023-06-28T14:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising