ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Food: ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మం కావాలా.. అయితే వీటిని తినాల్సిందే..!

ABN, Publish Date - Dec 29 , 2023 | 04:40 PM

అందమైన రూపాన్ని ప్రతిబింబించే వాటిలో చర్మం, జుట్టు, గోర్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలివే..

అందమైన రూపాన్ని ప్రతిబింబించే వాటిలో చర్మం, జుట్టు, గోర్లు ప్రథమ స్థానంలో ఉంటాయి. కాంతి వంతమైన చర్మం, ఆరోగ్యంగా పెరిగిన గోర్లు, ఒత్తుగా నల్లగా నిగనిగలాడే జుట్టు మొత్తం గెటప్ నే మార్చేస్తాయి. అయితే చాలామంది ఈ మూడు విషయాలలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. గోర్లు విరిగిపోవడం, జుట్టు నిర్జీవంగా మారడం, చర్మం మీద మచ్చలు, మొటిమలు, చర్మం చికాకుకు గురి కావడం వంటి సస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు,చర్మం, గోర్లలో కెరాటినోసైట్స్ ఉంటాయి. కెరాటినోసైట్స్ కెరాటిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేసి నిల్వ చేస్తాయి. కెరాటిన్ గోర్లు, జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు సహాపడుతుంది. కెరాటిన్ ఆధారిత ఆహారాలు తింటే సమస్య పరిష్కారమవుతుంది.

గింజలు, విత్తనాలు..

పొద్దుతిరుగుడు విత్తనాలలో బయోటిన్. ప్రోటీన్, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం దెబ్బతినకుండా కాపడతాయి. సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

స్వీట్ పొటాటో..

చిలగడదుంపలో కెరోటినాయిడ్స్, బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్-ఎ కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది చర్మం, గోర్ల ఆరోగ్యానికి అవసరమైన కెరాటిన్ ను కూడా ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

ఇది కూడా చదవండి: 1Crore remuneration: 80ల కాలంలోనే కోటి పారితోషికం తీసుకున్న కథానాయిక.. ఆ ఒక్క సీన్ కోసమే..



అవకాడో..

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి చర్మం కణాలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. అవకాడోలో విటమిన్-సి, ఎ, ఇ ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం.

గుడ్లు..

గుడ్లు అందరికీ అందుబాటు ధరలో దొరికే ఆహారం. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్. కెరాటిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుడ్లను క్రమం తప్పకుండా తీసుకునేవారిలో జుట్టు పెరుగుదల బాగుంటుంది.

ఆకుకూరలు..

ఆకుకూరలు శరీరానికి పోషకాలను సమృద్దిగా అందిస్తాయి. ఇవి జుట్టు, చర్మం, గోర్లకు మేలు చేస్తాయి. పాలకూర, కాలే, బచ్చలికూర వంటివి జుట్టు, చర్మం, గోర్ల ఆరోగ్యానికి సహాయపడతాయి.

ఇది కూడా చదవండి: మునగ ఆకులు తింటే కలిగే టాప్ 8 లాభాలివీ..!

నీరు అధికంగా ఉన్న ఆహారాలు..

చర్మం,జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం హైడ్రైట్ గా ఉండాలి. నీరు బాగా తీసుకున్నా జుట్టు పొడిబారి, గోర్లు విరిగిపోతూ, చర్మం నిర్జీవంగా ఉంటే నీరు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. దోసకాయ, పుచ్చకాయ, యాపిల్స్, పాలకూర, స్ట్రాబెర్రీలు, కూరగాయలు మొదలైన వాటిలో నీటి శాతం బాగుంటుంది. వీటిని తీసుకుంటూ ఉంటే చర్మం,జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి.

(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 29 , 2023 | 04:40 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising