ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Child Health : వర్షాకాలంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలంటే..!

ABN, First Publish Date - 2023-08-02T11:34:07+05:30

వర్షాకాలం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి. అప్పుడే చిన్నారుల ఆనందానికి హద్దులుండవు.

వర్షాకాలం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి. అప్పుడే చిన్నారుల ఆనందానికి హద్దులుండవు.

  • చిన్నపిల్లలు జంక్‌ఫుడ్‌నే మంచి ఆహారంగా భావిస్తారు. అసలు జంక్‌ఫుడ్‌ కంటే పోషకాలున్న ఆహారం తింటే ఎలాంటి లాభాలుంటాయో పిల్లలకు చెప్పాలి. జంక్‌ఫుడ్‌ను దూరంగా ఉంచాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం విషయంలో పేరెంట్స్‌ సగం సక్సెస్‌ అయినట్లు. పోషకాహారం లేమి ఉంటే ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్‌లో ఉంచాలి.

  • కొందరికి కోడిగుడ్డు పడదు, మరికొందరు పిల్లలకు టమోటా పడదు.. ఇలా ఫుడ్‌ అలర్జీ ఏ ఆహారంలో ఉందో తెలుసుకునే బాధ్యత అమ్మ తెల్సుకోవాలి. పిల్లల్లో జీర్ణసమస్యలు తలెత్తటం, వాంతులు చేసుకోవటం, యూరిన్‌ సరిగా రాకపోవటం.. లాంటి విషయాలను బట్టి అర్థం చేసుకోవాలి. దానికి తగినట్లు ఫుడ్‌లో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది.

  • మంచి ఆహారాన్ని చిన్నవయసులోనే చెప్పాలి. అప్పుడే వాళ్లు తెల్సుకోగలుగుతారు. కొన్ని పండ్లను నీట్‌గా కట్‌ చేసి పెరుగులో వేయటం, సలాడ్స్‌, జ్యూస్‌.. ఇలా వివిధ రూపాల్లో పిల్లలకు పరిచయం చేయాలి. అప్పుడే పిల్లలు ఆహారాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా అన్నంతో వివిధ ఆకుకూరలు కలిపి చేయటం... లాంటి ఫుడ్‌ తయారు చేయాలి. ముఖ్యంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ను మిస్‌ చేయకూడదు.

  • కందులు, పెసలు, మినుములు, శనగలు.. ఇలా వివిధ ధాన్యాలతో చేసిన ఆహారం పిల్లలకు తినిపించాలి. దీనివల్ల ఇందులోని ప్రొటీన్లు తెల్లరక్తకణాల వృద్ధికి ఉపయోగపడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. చిక్కుడు, బఠానీ, సోయాలతో చేసిన ఆహారాన్ని తినిపించటం వల్ల ప్రొటీన్లకు కొదువే ఉండదు.

  • శాకాహారం కంటే మాంసాహారాన్ని ఇష్టపడే పిల్లలు తగు పద్ధతుల్లో జీర్ణం అయ్యేట్లు వండి తినిపించాలి. ముఖ్యంగా చేపల్లాంటి వాటిలో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

  • ఏ ఆహారంలోకి అయినా పెరుగును కలిపి చేసి వండితే రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు తినిపించటం వల్ల కడుపులో గడబిడలుండవు. చల్లగా నిద్రపోతారు.

  • పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి విత్తనాలను తినిపించటం వల్ల చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇలాంటి బలవర్ధకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది.

  • ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు తాగించటం, బలవర్ధకమైన ఉడికిన కోడిగుడ్లు..లాంటివి సరైన సమయంలో తినిపించటం వల్ల పిల్లలు చిన్నపాటి వ్యాధులను ఎదుర్కొనగలరు. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం.

Updated Date - 2023-08-02T11:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising