Health Tips: కళ్లజోడు వాడుతుంటారా ? రోజూ ఈ గింజలను కొన్ని తీసుకోండి చాలు.. !!
ABN, Publish Date - Dec 15 , 2023 | 02:49 PM
రోజూ ఈ గింజలు కొన్ని తింటే చాలు.. కళ్లజోడు అవసరమే ఉండదు.
"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అని అంటారు. ఒకప్పుడు కేవలం పెద్దవాళ్లలో కనిపించే దృష్టిలోపం సమస్యలు ఇప్పుడు చిన్నపిల్లలలో కూడా కనిపిస్తున్నాయి. జీవనశైలి నుండి తీసుకునే ఆహారం వరకు అన్నీ కంటిచూపు మీద ప్రభావం చూపిస్తాయి. దృష్టిలోపం కారణంగా కళ్లజోడు వాడుతుంటారు. కానీ కంటి సమస్యలు పరిష్కరించి చూపుకు పదును పెట్టే సామర్థ్యం సోపు గింజలకు ఉంది. మౌత్ రిఫ్రెషర్ గానూ, భోజనం తరువాత తినే సోపు గింజలలో(Fennel seeds) ఉండే పోషకాలు ఏంటి? కంటి చూపు మెరుగుపడాలంటే వీటిని ఎలా తీసుకోవాలి? పూర్తీగా తెలుసుకుంటే..
పోషకాలు..(Nutrients)
సొంపు లేదా సోపు గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, సి, డి పుష్కలంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఐరన్, జింక్, కాల్షియం, కాపర్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. కంటిచూపు బలహీనంగా ఉన్నవారు సోపు గింజనలు తింటే అద్బుతమైన ప్రయోజనాలుంటాయి. కళ్లజోడు వాడుతున్నవారు వాటిని తీసి పక్కన పెట్టేయచ్చు కూడా.
ఇది కూడా చదవండి: Relationship Advice: రాత్రి పడుకునే ముందు భర్తలు ఈ మూడు పనులు చేస్తే చాలు.. భార్యలు ఫుల్లు హ్యాపీ..!
ఎలా తీసుకోవాలి..
ఒక గ్లాసు పాలలో సోపు గింజలు, బాదం పొడి, పంచదార వేసి బాగా కలపాలి. దీన్ని డ్రింక్ లాగా తాగుతూంటే కళ్ళ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. కంటి చూపు పదునెక్కుతుంది. ఇందులో పంచదార బదులు పసుపు, మిరియాల పొడి కూడా వేసుకుని తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పిల్లలు ఉదయాన్నే నిద్రలేస్తే కలిగే లాభాల లిస్ట్ ఇదీ..!
సొంపు పాలను రాత్రి పడుకునే ముందు తీసుకుంటే రెట్టింపు ఫలితాలు ఉంటాయి. ఇవి కేవలం కంటి ఆరోగ్యానికే కాదు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది.
సోపు గింజలలో కేలరీలు తక్కువగా ఉన్న కారణంగా బరువును నియంత్రిస్తాయి. వీటిలో ఉండే కాల్షియం, విటమిన్-సి, ఐరన్, మెగ్నీషియం కూడా బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఏవైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 15 , 2023 | 02:49 PM