Heart attack: ఈ లక్షణాలతో గుండెపోటును గుర్తించొచ్చు!
ABN, First Publish Date - 2023-05-16T12:52:43+05:30
గుండె పోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.
గుండె పోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వాటి పట్ల అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.
మహిళలు
• తల తిరుగుడు, మత్తు
• వీపు నొప్పి • ఛాతీలో ఒత్తిడి
• శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది
• ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడ, లేదా పొట్టలో నొప్పి
• స్పృహ కోల్పోవడం, విపరీతమైన నిస్సత్తువ గుండె పోటులో ఛాతీ నొప్పి సహజం. కానీ మహిళల్లో ఈ లక్షణం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
పురుషులు
• చమటలు పట్టడం, వాంతి
• ఛాతీలో ఒత్తిడి, నొప్పి • శ్వాసలో ఇబ్బంది
• ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడల్లో లేదా పొట్టలో నొప్పి
ఈ లక్షణాలు ఐదు నిమిషాలకు మించి వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.
లక్షణాలు కనిపించని గంటలోగా చికిత్స మొదలుపెడితే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
Updated Date - 2023-05-16T12:52:43+05:30 IST