ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kiwi Fruit: డయాబెటిస్ రోగులకు ఈ ఫ్రూట్ వరం

ABN, First Publish Date - 2023-06-16T12:52:01+05:30

కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇందులోని పోషకాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. సీజన్‌ మారుతున్నసమయాల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం

Kiwi Fruit
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కివీ పండు.. పోషక విలువలు మెండు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది

పుష్కలంగా ఫైబర్‌

కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఇందులోని పోషకాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. సీజన్‌ మారుతున్నసమయాల్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు పండ్ల వినియోగం అత్యంత అవశ్యం. మార్కెట్లో దొరికే పండ్లలో కివీ ఒక్కటి. ఇందులో విటమిన్‌ సి, ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుండె పనితీరుతోపాటు జీర్ణాశయానికి, రోగనిరోధక వ్యవస్థకు ఇది వరంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సీడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్‌ సాధారణ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. యాంటీఆక్సిడెంట్‌ విటమిన్లు కంటి వ్యాధుల నిరోధానికి ఉపయోగపడడమే కాకుండా కంటి చూపును మెరుగుపరుస్తాయి.

కివీ ఒక రుచికరమైన పండు. ఇతర పండ్ల మాదిరిగానే ఇందులో నాచురల్‌ షుగర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకు 140 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఈ పండ్లలో అధిక రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇది బీపీని నియంత్రించడమేకాక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండ్లు దోహద పడు తాయి. వీటిలో అధిక మొత్తంలో ఫైబర్‌ ఉండడం వల్ల జీర్ణం, ఇతర జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్‌, అజీర్తితో పోరాడుతుంది. ఆస్తమా నివారణలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వాపు, దానిపల్ల కలిగే వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

కివీతో ప్రయోజనాలు ఎక్కువ..

కివీలో ఔషధగుణాలు మెండుగా ఉంటాయి. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరు వీటిని తినవచ్చు. వీటిని తినడం వలన రోగనిరోధకశక్తి పెరగడంతోపాటు పోషకాలను పొందవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే సి విటమిన్‌తో మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కివీ అంటేనే ఖనిజాల గని అంటారు. విధిగా సీజన్‌లో లభించే కివీని ప్రతి ఒక్కరూ తినాలి.

- డాక్టర్‌ మహేందర్‌, చిల్డ్రన్స్‌ ఆస్పత్రి

హైదరాబాద్, షాపూర్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-06-16T12:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising