ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tati bellam: కేన్సర్ నివారణకు గొప్ప ఔషధం

ABN, First Publish Date - 2023-04-08T12:57:03+05:30

మన పెద్దలు తాటి బెల్లం (Palm jaggery)తో అనేక రోగాలు నయం చేసేవారు. ప్రస్తుత కాలంలో తాటి బెల్లం వినియోగం

Palm jaggery
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సర్వరోగ నివారిణి తాటిబెల్లం

పలు ఆరోగ్య రుగ్మతుల నివారణ

కేన్సర్‌ కణాలను నిర్మూలిస్తుంది

షాపూర్‌నగర్‌, హైదరాబాద్చ ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): మన పెద్దలు తాటి బెల్లం (Palm jaggery)తో అనేక రోగాలు నయం చేసేవారు. ప్రస్తుత కాలంలో తాటి బెల్లం వినియోగం తగ్గిందనే చెప్పాలి. ఇప్పటికీ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి తాటి బెల్లం ట్రాలీలలో నగరానికి తీసుకొచ్చి శివారు ప్రాంతాలు, మార్కెట్‌లలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు. కేజీ తాటి తాటి బెల్లంతో అనేక ఉపయెగాలు ఉన్నాయి. ఇందులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌ స్థాయి పెంచుతుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది. తాటి బెల్లంలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, భాస్వరం అధికంగా ఉంటాయి. స్త్రీలలో నెలసరి సమస్యను అరికడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సీడెంట్లు రక్తాన్ని శుద్ధిచేసి, శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. తాటిబెల్లంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వలన మలబద్దకం, అజీర్తిని నివారించడంలో సహాయపడుతుంది. శరీరంలో హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. తాటి బెల్లం తినడం వలన శ్వాసకోశ, పేగులు, ఆహారగొట్టం, ఊపిరితిత్తులు, చిన్నపేగులు, పెద్దపేగుల్లోని విషపదార్థాలను బయటకి పంపిస్తూ పేగు కేన్స్‌ర్‌ రాకుండా చేస్తుంది.

విటమిన్స్‌, మినరల్స్‌ అధికం

తాటి బెల్లం పూర్తిగా ఆర్గానిక్‌ కావడం వలన, అందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్స్‌, మినరల్స్‌ ఉండడమే కాకుండా అవి త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు దరిచేరవు. గ్యాస్‌, అసిడిటి, మలబద్దకం నుంచి విముక్తిచేస్తుంది. తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపర్చడమే కాకుండా మలబద్దక సమస్యను తొలగిస్తుంది. ఇందులో ఐరన్‌ అధికంగా ఉండడం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వలన కణాల పునరుత్పతి జరుగుతుంది. శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలు శుభ్రంగా ఉంచుతుంది.

ఉపయోగాలు

  • తాటి బెల్లం చక్కెరకు ప్రత్యామ్యయం

  • తాటి బెల్లంలో 60 రెట్లు ఎక్కువ ఖనిజలవణాలు ఉంటాయి.

  • ఇది రోగాల నివారణలో దిట్ట

  • కేన్సర్‌ను అరికట్టడడంలో పనిచేస్తుంది

  • ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది

  • శరీరంలో వేడిని తగ్గిస్తుంది

  • శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపిస్తుంది

  • ఊపిరితిత్తులు, చిన్నపేగులు, పెద్దపేగుల్లో ఉండే విషాలను బయటికి పంపించి పేగు కేన్సర్‌ రాకుండా నివారిస్తుంది

  • పొడి దగ్గు, ఆస్త్మా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు తాటి బెల్లం తిన డం వలన మంచి ఫలితాన్ని ఇస్తుంది

  • మైగ్రెయిన్‌ తలనొప్పికి దివ్యఔషధంగా పనిచేస్తుంది

  • అధిక బరువును తగ్గించడంలో, బీసీని కంట్రోల్‌ చేయడంలో ఉపకరిస్తుంది

తమిళనాడు నుంచి తీసుకొస్తాం

తాటి బెల్లం అమ్మకంతోనే జీవనాధారం. తమిళనాడు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి. తమిళనాడులో కేజీ రూ.25 నుంచి 40 వరకు కొనుగోలు చేస్తాం. హైదరాబాద్‌కి తీసుకొచ్చి రూ. 100 నుంచి 150 రూపాయలకు విక్రయిస్తాం.

-మురుగన్‌, తాటి బెల్లం విక్రయదారుడు

Updated Date - 2023-04-08T12:57:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising