Spice: గసగసాల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
ABN, First Publish Date - 2023-02-11T14:26:47+05:30
గసగసాలు (Gasagasalu).... ఈ మసాలా (spice) దినుసును ఎంతో అరుదుగా వాడుతూ ఉంటాం. కానీ దీనిలోని పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గసగసాలు (Gasagasalu).... ఈ మసాలా (spice) దినుసును ఎంతో అరుదుగా వాడుతూ ఉంటాం. కానీ దీనిలోని పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మలబద్ధకం: గసగసాలు అపాన వాయువుల ఉత్పత్తిని తగ్గించి, మలబద్ధకాన్ని (Constipation) నివారిస్తాయి. పొట్ట నిండిన భావాన్ని కలిగించి ఆకలిని నియంత్రిస్తాయి. అజీర్తి, పొట్టలో అసౌకర్యం, ఉబ్బరం ఉన్నవాళ్లు తరచుగా ఈ మసాలా దినుసును వంటకాలకు జోడిస్తూ ఉండాలి. గసగసాల్లో ఎంతో ఎక్కువ పీచు ఉంటుంది. ఇది అజీర్తిని తొలగించి సుఖ విరేచనం కలిగేలా చేస్తుంది.
నిద్ర సమస్యలు: ఇన్‌సోమ్నియా వంటి నిద్ర లేమిని తొలగించాలంటే గసగసాలను పాలు (milk), చక్కెరల (Sugar)తో కలిపి తీసుకోవాలి. నిద్ర (sleep) సమస్యను పరిష్కరించడంలో గసగసాలు సాటిలేనివి. అయితే ఆ పానీయం నిద్రకు గంట ముందు తీసుకుంటే తప్పక ఫలితం దక్కుతుంది.
శ్వాసకోశ సమస్యలు: ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యల (Respiratory problems)తో బాధపడుతున్నవారు గసగసాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఊపిరితిత్తుల్లో నెమ్ము, కఫాలను కరిగించి శ్వాసకోశ వ్యవస్థను తేలిక పరిచే శక్తి వీటికి ఉంటుంది. అలాగే దగ్గును తగ్గించి, ఉపశమనాన్ని కలిగిస్తుంది.
విపరీత స్థితులు: కొలెస్ట్రాల్ (Cholesterol)లో హఠాత్తుగా పెరుగుదల కనిపించి గుండెపోటుకు గురయ్యే పరిస్థితి నుంచి తప్పించుకోవాలన్నా గసగసాలను తినాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లతోపాటు గసగసాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తే గుండె సమస్యలు (Heart problems) తలెత్తకుండా ఉంటాయి. గసగసాల్లో అత్యధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి తీవ్ర రుగ్మతలకు గురవకుండా ఉండాలంటే సాధ్యమైనంత తరచుగా వీటిని ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి.
మూత్రపిండాల్లో రాళ్లు: పీచు, యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) కలిగి ఉండే గసగసాలు తినడం ద్వారా శరీరంలోని విషాలు తేలికగా విసర్జింపబడతాయి. ఫలితంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విషాలను ఎప్పటికప్పుడు బయటకు వెళ్లకపోతే అవి మూత్రపిండాల్లో (Kidneys) రాళ్లుగా మారతాయి. దీర్ఘకాలంలో ఈ రాళ్ల కారణంగా మూత్రపిండాలు దెబ్బతిని మూత్ర వ్యవస్థ పనితీరు దెబ్బ తింటుంది.
నొప్పి నివారిణి: నొప్పి ఏ కారణంగా, ఏ ప్రదేశంలో తలెత్తినా గసగసాలు నమలడం వల్ల ఉపశమనం దక్కుతుంది. దంతాల నొప్పులు, కండరాలు, నరాల నొప్పులను గసగసాలు తగ్గిస్తాయి. అయితే ఈ నొప్పులు రోజుల తరబడి వేధిస్తుంటే తప్పక వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి.
Updated Date - 2023-02-11T14:26:49+05:30 IST