Walking: వాకింగ్‌లో ఇంత మర్మం ఉందా?
ABN, First Publish Date - 2023-04-05T14:48:28+05:30
కార్డియో వర్కవుట్స్, జిమ్స్, ఆఖరికి రన్నింగ్ కంటే వాకింగ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. తాజాగా వచ్చిన ఓ సర్వే నడకతోనే అసలైన ఆరోగ్యమని తేల్చి చెప్పింది...
కార్డియో వర్కవుట్స్, జిమ్స్, ఆఖరికి రన్నింగ్ కంటే వాకింగ్ బెస్ట్ అంటున్నారు నిపుణులు. తాజాగా వచ్చిన ఓ సర్వే నడకతోనే అసలైన ఆరోగ్యమని తేల్చి చెప్పింది...
కొందరు గుండె సమస్యలు (heart) రాకుండా ఉండటానికి కార్డియో ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్తుంటారు. రన్నింగ్ ఎక్కువగా చేస్తుండారు. అయితే ఇవన్నీ చేయటం వల్ల తెలీకుండానే ఒత్తిడిని పెరుగుతుంది. రన్నింగ్ కంటే. వాకింగ్ లేదా బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల ఒత్తిడి మరింత తగ్గుతుందని, అదుపులో ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. 33 వేల మంది రన్నింగ్ చేసేవారిని.. 15 వేల మంది వాకర్స్ డేటాను తీసుకుని పరిశోధన చేశారు. రన్నింగ్ చేసే వారికంటే వాకింగ్ (Walking) చేసేవారికి గుండె (heart) సమస్య తక్కువగా ఉందని తేలింది. రన్నింగ్ చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ 4.2 శాతం తగ్గితే.. వాకింగ్ చేయటం వల్ల బ్లడ్ ప్రెషర్ 7.2 శాతం తగ్గిందని తేలింది. ఇలా వాకింగ్ చేయటం వల్ల మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి అదుపులో ఉంటుంది. దీంతో పాటు బరువు కూడా తగ్గుతారు. మొత్తానికి వాకింగ్ పది నిముషాలు చేసి రిలాక్స్ తీసుకున్నాక.. వేగాన్ని పెంచి మరో ఇరవై నిముషాలు చేశాక కాస్త విశ్రాంతి తీసుకోవాలి. ఈ పద్ధతి వల్ల ఎంతో ఉపయోగం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-04-05T14:48:28+05:30 IST