ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Weight loss: వావ్.. బరువు తగ్గడానికి భలే టెక్నిక్.. దీన్ని కనుక పాటిస్తే..!

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:16 PM

ఇదొక్కటి ఫాలో అయితే బరువు తగ్గడం నుండి బోలెడు అనారోగ్యాలు కూడా మంత్రించినట్టు మాయమవడం పక్కా..

అధిక బరువు అనర్థం అనే విషయం తెలిసిందే. మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావడానికి అధికబరువు కారణమవుతుంది. కానీ ఇప్పట్లో చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. బరువు తగ్గడానికి చాలామంది నోరు కట్టేసుకుంటారు. మిడిమిడి జ్ఞానంతో ఆహారం సరిగా తీసుకోకుండా, మరొకవైపు శరీరాన్ని కష్టపెడుతూ చివరికి పోషకాహార లోపానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అలా కాకుండా ఒకవైపు శరీరానికి పోషకాలు అందుతూనే.. మరొకవైపు ఈజీగా బరువు తగ్గించే టెక్నిక్ ఉంది. అదే 30-30-30 టెక్నిక్. 2023లో బాగా వైరల్ అయిన ఈ బరువు తగ్గే టెక్నిక్ ఫాలో అయిన వారు మెరుగైన ఫలితాలు పొందారనే విషయం చాలా ఆసక్తికరంగా మారింది. అసలు 30-30-30 టిక్నిక్ లో ఏమేం ఉంటాయి? బరువు తగ్గడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..

30-30-30 టెక్నిక్ లో మూడు ఆరోగ్యకరమైన పద్దతులు ఫాలో అవుతారు. అవే పోషకాహారం, వ్యాయామం, సంపూర్ణత.

ఇది కూడా చదవండి: ఈ 6 కూరగాయలు తింటే చాలు.. 15రోజుల్లో పొట్ట కొవ్వు మాయం!


పోషకాహారం..(Nutrition)

30శాతం సమతుల్య పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి చేర్చుకోవాలి. ఆహారంలో కూరగాయలు ఎప్పుడూ విభిన్న రంగులలో ఉండేలా చూసుకోవాలి. మూడుపూటలా భారీ ఆహారం తినడం కంటే రోజులో 5 లేదా 6 సార్లు తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి. ఇవి బరువు తగ్గడంలో చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది.

వ్యాయామం..(Exercise)

బరువు తగ్గడానికి వ్యాయామం ఫాలో అయ్యేవారు దానిమీద అవగాహన కలిగి ఉండాలి. వ్యాయామానికి కేటాయించిన సమయంలో 30శాతం కార్డియోవాస్కులర్ వ్యాయామాలు ఫాలో అవ్వాలి. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, వేగవంతమైన నడక మొదలైనవి కార్డియోవాస్కులర్ వ్యాయామాలు. మరొక 30శాతం సమయాన్ని ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం కేటాయంచాలి. ఇది కండరాల బలాన్ని, జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకొక 30శాతం సమయాన్ని యోగా, పైలెట్స్, ఆసనాలు వంటివి ఫాలో కావాలి. రోజూ కనీసం గంట సమయంలో ఈ మూడింటికి ఒక్కొక్కదానికి 20నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది.

ఇది కూడా చదవండి: Spices: చలికాలంలో శరీర ఉష్ట్రోగ్రత నిలకడగా ఉండట్లేదా.. వంటింట్లో ఉండే వీటిని ట్రై చేస్తే..!



మైండ్ ఫుల్ నెస్..(Mindfulness)

మెండ్ ఫుల్ నెస్ ఈ మధ్యకాలంలో చాలామందిని ప్రభావితం చేస్తున్న అంశం. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి వేసినప్పుడే తినడం, తీసుకునే ఆహారం మీద అవగాహన, తినేటప్పుడు ఆహారం మీద దృష్టిపెట్టడం చేయాలి. రోజులో ఏ పని చేస్తున్నా ఆ పని మీద దృష్టి పెట్టడం, ఆలోచనలను నియంత్రించుకుని వర్తమానంలో జీవించడం చేయాలి. ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: Stomach bloating: భోజనం చేసిన తరువాత కడుపు ఉబ్బరంగా ఉంటుందా? ఈ చిట్కాలు పాటిస్తే ..!


లాభాలు..

30-30-30 టెక్నిక్ వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు ఇతర లాభాలున్నాయి.

పోషకాహారం, వ్యాయామం, మైండ్ ఫుల్ నెస్ మూడు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీవనశైలి నుండి ఆలోచనల వరకు ప్రతి విషయంలో ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు ఈ టెక్నిక్ వల్ల కలుగుతాయి.

శరీరం ఫిట్ గా మారుతుంది. వ్యక్తులు తమ గురించి తాము శ్రద్ద చూపిస్తారు. అతిగా ఆలోచించడాన్ని, అసవసరపు ఒత్తిడిలను దూరం పెడతారు.

శరీరం, మనస్సు రెండూ అనుసంధానంగా పనిచేయడం దీనివల్ల సాధ్యమవుతుంది.

(గమనిక: ఇది ఆరోగ్య నిపుణులు, వైద్యులు పలు చోట్ల పేర్కౌన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 24 , 2023 | 12:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising