ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Womens Care: మీరు ఇలా ఉంటే ఫిట్‌..!

ABN, First Publish Date - 2023-01-03T11:21:09+05:30

మహిళల (Womens) ఆరోగ్యం మీద హార్మోన్ల ప్రభావం ఎక్కువ. క్లిష్టమైన మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్ని రుగ్మతలు

ఇలా ఉంటే ఫిట్‌..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల (Womens) ఆరోగ్యం మీద హార్మోన్ల ప్రభావం ఎక్కువ. క్లిష్టమైన మహిళల పునరుత్పత్తి వ్యవస్థ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్ని రుగ్మతలు అస్తవ్యస్థ జీవనశైలుల వల్లా, వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తూ ఉంటాయి. వాటి పట్ల కొంత అవగాహన ఏర్పరుచుకుని, అప్రమత్తంగా ఉండడం అవసరం.

కొందరు మహిళలకు గర్భం (pregnancy) దాల్చిన 20 వారాల్లోపే వరుసగా గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. అయితే మొదటి మూడు నెలల్లో గర్భస్రావాలకు, తర్వాతి 4, 5, 6వ నెలల్లో గర్భస్రావాలకు కారణాలు వేర్వేరు. అయితే ఒకసారి గర్భస్రావం అయినంత మాత్రాన ఇక గర్భం నిలవదేమో అని కంగారు పడవలసిన అవసరం లేదు. వరుసగా మూడు సార్లు గర్భస్రావం అయినప్పుడే పరీక్షలు చేయించుకోవాలి. మూడు నెలల్లోగా గర్భస్రావం అవుతూ ఉంటే, పిండంలో తేడాలున్నాయని అర్థం. మాయ ఎదుగుదలలో తేడాలున్నా, మహిళ వయసు ఎక్కువగా ఉన్నా, ఊబకాయం ఉన్నా గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా కాఫీ పొడి (Coffee powder) తీసుకునే వారికి కూడా అబార్షన్‌(Abortion) అవవచ్చు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు కూడా గరస్రావాలకు కారణాలే! మూడవ నెల తర్వాత జరిగే అబార్షన్లకు అదుపు తప్పిన మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాలు(Kidneys), థైరాయిడ్‌ సమస్యలు ప్రధాన కారణాలు. మొటిమల కోసం నోటి ద్వారా తీసుకునే రెటినాయిడ్‌ మాత్రల వల్ల కూడా గర్భస్రావం అయ్యే అవకాశాలుంటాయి. గర్భసంచికి ఫైబ్రాయిడ్‌ గడ్డలున్నా, గర్భసంచి నిర్మాణంలో లోపాలున్నా, గర్భసంచి ముఖద్వారం బలహీనంగా ఉన్నా అబార్షన్లు అవుతాయి.

నివారణ ఇలా...

ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు గర్భిణులు దూరంగా ఉంటూ, సమతులాహారం తీసుకోవాలి. బయటి ఆహారం పూర్తిగా మానేయాలి. పూర్తిగా ఉడకని మాంసాహారం, గుడ్లు, ఎ విటమిన్‌ ఎక్కువగా ఉండే లివర్‌ తినకూడదు. అలాగే పాదరసం ఎక్కువగా ఉండే షార్క్‌ లాంటి సముద్రాహారం తినకూడదు. కాఫీ పరిమితం చేయాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. మల్టీ విటమిన్‌ మాత్రలను సొంతంగా తీసుకోకూడదు. మధుమేహం, అఽధిక రక్తపోటు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత గర్భధారణను ప్లాన్‌ చేసుకుంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అప్లాస్‌ అనే యాంటిబాడీ సిండ్రోమ్‌ సమస్య ఉన్నవాళ్లు, గర్భం దాల్చినప్పటి నుంచి రక్తం పలుచనయ్యే హెపారిన్‌ ఇంజెక్షన్లను వాడుకోవలసి ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం బలహీనంగా ఉండే సర్‌క్లాజ్‌ స్టిచ్‌ అవసరమవుతుంది.

పిసిఒడి ఎందుకంటే...

కొందర్లో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ కొందర్లో లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమస్యలో అండాలు ఉత్పత్తి అవుతున్నా అవి మెచ్యూర్‌ కావు. ఇలా అండాశయాల పనితీరు అస్తవ్యస్థం కావడానికి కారణం శరీరంలో ఇన్సులిన్‌ హార్మోన్‌ మోతాదు పెరిగిపోవడమే! ఈ అధిక ఇన్సులిన్‌ పురుష హార్మోన్‌ టెస్టోస్టిరాన్‌ను పెంచేస్తుంది. దాంతో నెలసరి క్రమం తప్పడం, ముఖం మీద వెంట్రుకలు పెరగడం, బరువు పెరగడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. బరువు ఎక్కువగా ఉండే అమ్మాయిల్లో ఇన్సులిన్‌ ఇంతకంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. పిసిఒడి సమస్య తలెత్తడానికి కచ్చితమైన కారణాలు తెలియవు. ఈ సమస్య వంశపారంపర్యంగా తల్లి నుంచి బిడ్డకు సంక్రమిస్తూ ఉంటుంది.

నివారణ ఇలా...

దీని లక్షణాలను చికిత్సతో నివారించుకోవచ్చు. అలాగే జీవనశైలి మార్పులను అనుసరించడం కూడా తప్పనిసరి. ఈ సమస్య ఉన్నవాళ్లు వ్యాయామాలు చేయడం అవసరం. బరువు 5ు తగ్గినా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇలా బరువు తగ్గడం వల్ల పిసిఒడి ఉన్న వాళ్లకు దీర్ఘకాలంలో వచ్చే మధుమేహం, గర్భసంచి కేన్సర్‌ సమస్యలను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి మహిళలు తమ బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 నుంచి 24 మధ్య ఉండేలా చూసుకోవాలి. పాలిష్‌ పట్టని బియ్యం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నెలసరి క్రమం తప్పిన వాళ్లు ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ పిల్స్‌ వాడడం అవసరం. నెలసరులే రాని వాళ్లు మూడు నెలలకోసారి ప్రొజెస్టరాన్‌ పిల్స్‌ తీసుకుంటూ నెలసరి వచ్చేలా చేసుకోవాలి. బ్లీడింగ్‌ ఎక్కువగా ఉండే కాపర్‌ టిని పోలిన మెరీనా వాడుకోవాలి.

ఫైబ్రాయిడ్లు కేన్సర్‌ గడ్డలు కావు

ఇవి గర్భసంచి గోడలో, లోపల, చుట్టుపక్కల పెరగవచ్చు. వీటికి సరైన కారణం తెలియకపోయినా, ఫైబ్రాయిడ్లకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌కు దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టే 30 నుంచి 50 ఏళ్ల మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఫైబ్రాయిడ్లు ఉన్నప్పటికీ, అందర్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. నెలసరి స్రావం ఎక్కువగా ఉండి రక్తహీనతకు గురవుతున్నా, సమస్య మందులకు లొంగకపోయినా, ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవిగా ఉన్నా, వాటి వల్ల మూత్రాశయం, పేగుల మీద వత్తిడి పడుతున్నా సర్జరీ చేయించుకోవాలి.

నివారణ ఇలా: బరువును అదుపులో ఉంచుకోవాలి. దాంతో ఈస్ట్రోజన్‌ మోతాదు తగ్గి, ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.

-డాక్టర్‌ శిరీష ప్రమత

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌

గైనకాలజిస్ట్‌, బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో, సికింద్రాబాద్‌.

Updated Date - 2023-01-03T11:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising